కోటప్పకొండ త్రైమాసిక ఆదాయం రూ. 20.6 లక్షలు
నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరునికి రూ.20,66,483 త్రై మాసిక ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో డి.శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ ఆవరణలో శుక్రవారం హుండీ లెక్కింపు చేపట్టారు. గత జులై నెల తొలిఏకాదశి మొదలుకోని మూడు నెలల హుండీ అదాయాన్ని అధికారుల పర్యవేక్షణలో భక్తసమాజం, స్కౌట్స్‌అండ్ గైడ్స్ వలంటీర్లు లెక్కించారు. లెక్కింపులో నగదుతో పాటు 21గ్రాముల బంగారం, 153 గ్రాముల వెండి, ఒక అమెరికన్ డాలర్‌ను భక్తులు స్వామి వారికి సమర్పించుకున్నట్టు ఈవో తెలిపారు. కాగా గతేడాది కన్నా ఈ ఏడాది కార్తీకమాస ప్రారంభానికి రూ.3.86లక్షలు అధికంగా ఆదాయం అలయానికి లభించిందని వివరించారు. కొటంరాజుకొండూరు అమ్మవారి ఆలయ ఈవో పి.శ్రీనివాసరావు, యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు, పొన్నూరు స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధి డి.శ్రీనివాసరావు, ఆలయ ఈవో డి.శ్రీనివాసరావు, మహిళా భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు.