
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పెద్ద మనసును చాటుకున్నారు. తను వెళ్తున్న దారిలో రోడ్డు ప్రమాదం జరగడం గమనించిన మంత్రి క్షతగాత్రులకు సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. కోటప్పకొండ సమీపంలో ఆదివారం బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు గాయపడ్డారు. అయితే అటుగా వెళ్తున్న ఆదిమూలపు సురేశ్ ఈ ఘటనను గమనించి తన కాన్వాయ్‌ను ఆపారు. 108ని పలిపించడమే కాకుండా.. దగ్గరుండి దంపతులకు ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై మంత్రి స్పందించిన తీరును స్థానికులు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment