గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు.
కోటప్పకొండ(గుంటూరు): గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా కోటప్పకొండ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది.
నరసరావుపేటకు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.