
టీడీపీ జెండాలతో కొండ వద్ద ఉన్న యడవల్లి తెలుగుదేశం పార్టీ ప్రభ
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద నిర్వహించే తిరునాళ్లకు వచ్చే ప్రభలపై రాజకీయ పార్టీల జెండాలు ఉంటే సహించబోం. అంటూ రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు చేసిన హెచ్చరికలను టీడీపీ శ్రేణులు పట్టించుకున్నట్లుగా కన్పించలేదు. ఆయన ఆదేశాలను ఖాతరు చేయకుండా రెండు ప్రభల నిర్వాహకులు ఏకంగా టీడీపీ జెండాలతో తీసుకొనిరావటం గమనార్హం. సోమవారం కోటప్పకొండ వద్ద జరిగిన తిరునాళ్లకు సుమారు 11 విద్యుత్ ప్రభలు తరలిరాగా, వాటిలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వచ్చిన యడవల్లి, కమ్మవారిపాలెం గ్రామాలకు చెందిన ప్రభలు ఏకంగా తెలుగుదేశం పార్టీ జెండాలను ఏర్పాటుచేసి కొండకు తీసుకొచ్చారు. ప్రభలపై తెలుగుదేశం పార్టీ ప్రభ అంటూ బోర్డులను సైతం ఏర్పాటుచేయటం గమనార్హం.