shivarathri utsavalu
-
మహాశివరాత్రి జాతర: ఎములాడ జాతరకెళ్దాం..
సాక్షి, వేములవాడ: తెలంగాణ జిల్లాల్లోనే పేదల దేవుడిగా..దక్షిణకాశీగా ఎముడాల రాజన్న ఆలయం వెలుగొందుతోంది. రాజన్న సన్నిధానంలో ఈ నెల 20 నుంచి మహాశివరాత్రి జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మూడు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. రాజన్న జాతర ఉత్సవాలను రూ. 2.50 కోట్లతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో శివార్చన అనే ప్రత్యేక సాంస్క ృతిక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. వేములవాడకు చేరుకునే ఐదు ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేందుకు భారీ స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు. స్థల పురాణవిుదీ.. ఈ క్షేత్రంలో స్వామి వారి లింగరూపుడై గర్భగుడిలో భక్తులకు దర్శనమిస్తాడు. రాజన్న గుడికి సంబంధించిన అనేక పురాతన గాథలున్నాయి. పూర్వం నారద మహాముని భూలోకంలో సంచరిస్తూ పాపాలతో బాధపడుతున్న జనాన్ని చూసి వారికి విముక్తి కలిగించేందుకు పరమశివుడిని వేడుకోగా స్వామి కాశీలో శివుడు ఉద్భవించినట్లు చెబుతుంటారు. అక్కడ శివుడు సంతప్తి చెందక వేములవాడకు చేరుకున్నాడని, శివుడి వెంట భాస్కరుడు వచ్చాడని ప్రతీతి. అందుకే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రంగానూ.. హరిహరక్షేత్రంగా పిలుస్తారు. చారిత్రక విశిష్టత... క్రీ.శ.750 నుంచి 973 వరకు చాళుక్యరాజులు వేములవాడను రాజధానిగా చేసుకుని పరిపాలన గావించారని చారిత్రక ఆధారాలుండగా, వీరికి పూర్వమే శాతవాహనులు పరిపాలించినట్లు ఆధారాలున్నట్లు చెబుతుంటారు. శాతవాహనుల కాలం నాటికే వేములవాడలో జైనులు, బౌద్ధుల ఆచార వ్యవహారాలు తెలిపే విగ్రహాలు అనేకం నేటికి ఉన్నాయి. రాజన్న చెంతకు చేరుకోవడం ఇలా... రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్లు . రాజన్నను దర్శించుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే. హైదరాబాద్ నుంచి ప్రతీ అరగంటకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతీ పది నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. రైల్వే సౌకర్యం లేదు. పెద్దపల్లి, వరంగల్, కామారెడ్డికి రైల్వే మార్గంలో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వేములవాడకు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్లు సిద్దిపేట ద్వారా, వరంగల్ నుంచి వచ్చే వారు కరీంనగర్ మీదుగా వేములవాడకు చేరుకునే రోడ్డు మార్గం ఉంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుడి చెరువు కట్టకింద ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం కౌంటర్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. దాదాపు 600 బస్సులను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. టూరిజం ద్వారా బస్సులు ఏర్పాటు చేశారు. వేములవాడ గుడి చేరుకునేందుకు వీలుగా ఉచిత మినీబస్సులు ఏర్పాటు చేశారు. కోడె మొక్కు విశిష్టత.. మత సామరస్యానికిది ప్రతీక సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో కొడుకు పుడితే కోడె కట్టేస్తా రాజన్నా అంటూ మొక్కుకుంటారు. సంతానం కల్గిన అనంతరం వేములవాడకు చేరుకుని స్వామి వారికి కోడె మొక్కు చెల్లించుకుంటారు. వ్యవసాయం బాగుండాలని మొక్కుకునే రైతుల సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ పాడిపంటలు బాగుండాలని మొక్కుకున్న రైతులు తమ ఇంటివద్ద పెంచి పెద్దచేసిన కోడెలను (నిజకోడె) స్వామి వారికి అప్పగించి మొక్కులు తీర్చుకుంటారు. కోడెలను కట్టేసే ఆచారం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలోని గర్భగుడి సమీపంలో మతసామరస్యానికి ప్రతీకగా దర్గా ఉంది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు దర్గాలోని ఖాజాబఖశ్వార్ను దర్శించుకుంటారు. ధర్మగుండం స్నానాలు... తలనీలాల మొక్కులు మొట్టమొదట ఈ ధర్మగుండం మడుగుగా ఉండేది. నరేంద్రమహారాజు కుషు్టవ్యాధితో బాధపడుతూ ఈ క్షేత్రాన్ని సందర్శించి ధర్మగుండంలో స్నానమాచరించడంతో కుష్టువ్యాధి నయమైనట్లు స్థలపురాణం కథనం. అందుకే దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడే వారు ధర్మగుండంలో స్నానాలు చేస్తే వ్యాధి నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ధర్మగుండంలో ఉచితంగా స్నానం చేయొచ్చు. అనంతరం కల్యాణకట్టలో రూ.10 చెల్లించి టికెట్ తీసుకుని తలనీలాలు సమర్పించుకుంటుంటారు. రాజన్న మొక్కులు చెల్లించుకున్న భక్తులు బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించుకుంటారు. పూజలు– దర్శనీయ స్థలాలు రాజన్న జాతర సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేసి కేవలం స్వామి వారి దర్శనాలు, కోడె మొక్కులు మాత్రమే అనుమతిస్తారు. రాజన్న ఆలయంతోపాటు వేములవాడ పరిసరాల్లో అనుబంధంగా అనంతకోటి పద్మనాభస్వామి, భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారీశ్వర, వేణుగోపాల స్వామి, నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి, అగ్రహారం జోడాంజనేయ స్వామి దేవాలయాలున్నాయి. రాజన్నను దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాల్లోనూ పూజలు చేస్తారు. వసతి గదులు... ప్రసాదాలు స్వామి వారి సన్నిధికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ విచారణ కార్యాలయానికి చేరుకుని అద్దె గదులు తీసుకుంటారు. స్వామి వారి గదులు లభించని భక్తులు ప్రైవేటు లాడీ్జలను ఆశ్రయిస్తారు. భక్తుల కోసం 476 వసతి గదులున్నాయి. అయితే జాతర సందర్భంగా ఈ గదులను అద్దెకు ఇవ్వకుండా జాతర ఏర్పాట్ల కోసం వచ్చిన అతిథులకు కేటాయిస్తారు. దీంతో భక్తులు ప్రైవేట్ లాడ్జ్‌లు లేదా ఆలయం వారు వేసిన చలవపందిళ్ల కిందే వంటావార్పు చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రైవేట్ లాడ్జ్‌ల నిర్వాహకులు రద్దీని బట్టి గదుల రేట్లను పెంచేస్తారు. ఒక్కో గదికి రూ.500 నుంచి మొదలుకుని రూ.1500 వరకు వసూలు చేస్తుంటారు. రాజన్నను దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, పాతఆం«ధ్రాబ్యాంకు భవనంలో ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.15, పులిహోరా పాకెట్ రూ.10 చొప్పున భక్తులకు అందిస్తారు. రాజన్న జాతర పూజలు... మహాజాతర సందర్భంగా ఆలయంలో మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే జాతర ఉత్సవాల సందర్భంగా నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకు ఫ్రీగా ధర్మదర్శనం, రూ.50 చెల్లించి స్పెషల్ దర్శనాలు, రూ.100 చెల్లించి కోడె మొక్కులు, రూ.200 స్పెషల్ కోడె మొక్కులు, రూ.100 శీఘ్రదర్శనం టికెట్లు తీసుకుని దర్శించుకోవచ్చు. ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు నిషిపూజ అనంతరం సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు స్థానికుల దర్శనాలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తారు), 3.30 గంటల వరకు కౌన్సిలర్లు, ప్రజాప్రతిని«ధులకు, 21న ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అక్కడి అర్చకుల ప్రత్యేక బృందం, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ ప్రతినిధి స్వామి వారికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు అందిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజామున 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు) నిర్వహిస్తారు. రాజన్న భక్తులకు 3 లక్షల లడ్డూలు వేములవాడ : ఎములాడ రాజన్న భక్తులకు మూడు లక్షల లడ్డూలు సిద్ధమవుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం అందించేందుకు ఆలయ ప్రసాదాల గోదాం ఇన్చార్జీలు రెండు రోజులుగా పనుల్లో వేగం పెంచారు. అదనపు కార్మికులతో పెద్దఎత్తున లడ్డూ ప్రసాదం తయారు చేయిస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల లడ్డూ ప్రసాదం సిద్ధంగా ఉంది. 20, 21, 22వ తేదీల్లోనూ భక్తులు వచ్చే రద్దీని బట్టి మరో లక్షలడ్డూల వరకు తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దేవాదాయశాఖ లడ్డూ తయారీలో ప్రత్యేక శ్రద్ధచూపుతోంది. ఓపెన్‌స్లాబ్‌లో ప్రసాదాల విక్రయాల కౌంటర్లు అందుబాటులో ఉంచుతున్నారు. గోదాం ఇన్చార్జి వరి నర్సయ్య మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు 3 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచాలని ఈవో ఆదేశించారని తెలిపారు. ఉచిత భోజనం.. తాగునీటి సౌకర్యం జాతర సందర్భంగా మూడురోజులపాటు స్థానిక వైశ్యసత్రం ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి కాంప్లెక్సులో ఉచితంగా భోజన సౌకర్యం, పార్వతీపురంలో స్వామి వారి అన్నదానంలో ఉచిత భోజన వసతి కలదు. భక్తుల దాహార్తి తీర్చేందుకు 4 లక్షల నీటి పాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని క్యూలైన్లలోని భక్తులకు అందిస్తారు. వీటితోపాటు ప్యూరిఫైడ్ వాటర్‌ను కూడా భక్తులకు అందిస్తారు. అత్యవసర సేవలు జాతర పర్వదినాల సందర్భంగా ఆలయం ఎదుట పోలీస్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. ఇందుకు టోల్‌ఫ్రీ నంబర్ 18004252037 ఇచ్చేశారు. ఇవే కాకుండా నిరంతరం పోలీసు గస్తీ బృందాలను ఎస్పీ రాహుల్‌హెగ్డే అందుబాటులో ఉంచారు. ఆలయం ముందున్న అమ్మవారి కాంప్లెక్స్‌లో తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. పార్కింగ్ స్థలాలు, వసతి గదుల వద్ద కూడా నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీటిన్నింటిని పర్యవేక్షించేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్‌తోపాటు 13 మంది నోటల్ ఆఫీసర్లను కలెక్టర్ కృష్ణభాస్కర్ నియమించారు. వీటితోపాటుగా అంబులెన్స్, ఫైర్సేవలు కూడా అందుబాటులోకి తెచ్చారు. భక్తులకు ఇబ్బందులు రానివ్వం రాజన్న జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వం. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వివిధశాఖల అధికారుల సమన్వయంతో జాతర ఉత్సవాలు విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటున్నాం. – కృష్ణవేణి, ఆలయ ఈవో రాయదండి శ్రీరామేశ్వరుడు రామగుండం:అంతర్గాం మండల పరిధిలోని రాయదండి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీచిలుకల రామేశ్వరాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. రెండురోజులపాటు జరిగే వేడుకలకు ఆలయ కమిటీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాయదండి ఆలయానికి ఎనిమిది శతాబ్దాల చరిత్ర క్రీస్తు పూర్వం ఎనిమిది శతాబ్దాల క్రితం ఇక్కడ చాళక్యులు, చోళరాజులు పాలించినటువంటి ప్రాంతంగా పూర్వీకులు చెబుతారు. ఇక్కడ రాజులు దండిగా ఉండేవారు కావడంతో రాజులదండి పేర్కొంటుండగా కాలక్రమేణా దీనికి రాయదండిగా పేరు వచ్చింది. చిలుకల రామేశ్వరాలయం గర్భగుడిలో అమ్మవారి ముక్కు పుడక, కాళ్లకు గజ్జెలు ధరించిన విగ్రహ రూపం, గణపతి, నలుదిక్కుల నాలుగు నందీశ్వరుడి ఉత్సవ విగ్రహాలు వీటితోపాటు శ్రీలక్షి్మనర్సింహాస్వామి, సుబ్రహ్మణేశ్వరస్వామి, నాలుగు దిశలలో ఆంజనేయస్వామి విగ్రహాలుండేవి. వల్లుబండ, సనాతన ఆలయంలో ప్రతీరోజు రాజుల అన్నదానంతో ప్రాంతమంతా పూర్తి ఆధ్యాత్మికత వాతావరణంలో ఉన్నట్లు చరిత్రలో ఉంది. తొంభై రకాల ఆంజనేయస్వామి రూపాలు ఉండేవి. ప్రస్తుతం ఆలయానికి దక్షిణంలో దాసాంజనేయస్వామి విగ్రహం మాత్రమే మిగిలి ఉన్నట్లు పేర్కొన్నారు. కల్యాణ మహోత్సవ వేడుకల షెడ్యూలు భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించాలనే నిబంధన అమలు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన శుక్రవారం ఉదయం వేకువజామున సుప్రభాతసేవ, సామూహిక రుద్రాభిషేకం నిత్యారాదణ, తొమ్మిది గంటలకు గణపతి పుణ్యహవచనం, ప్రదోషకాలపూజ ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, స్వామివారికి వస్త్రాలు సమర్పణ, రాత్రి 8.05 గంటలకు స్వామి కల్యాణ మహోత్సవం, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం తీర్థవితరణ, అర్ధరాత్రి 12లకు లింగోద్భావ కాలములో ఉపన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, తదనంతరం జాగరణ, భజన కార్యక్రమంతో ముగింపు. మరుసటి రోజు (శనివారం)లింగోద్భావ కాలంలో స్వామివారి నాగవెళ్లి, పల్లకీసేవ, అన్నదానంతో ముగింపు. తొంబర్రావుపేట పాలరాతి శివుడు మేడిపెల్లి(వేములవాడ): సాధారణంగా అన్ని శివాలయాల్లో శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తే ఇక్కడ మాత్రం శివుడి నిజరూపదర్శనం భాగ్యం లభించడం ఇక్కడి ప్రత్యేకత. ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడి విగ్రహంగా ప్రసిద్ధిచెందింది. అదే మేడిపెల్లి మండలంలోని తొంబర్రావుపేట శివాలయంలోని శివుడి విగ్రహం. ఐదు ఫీట్ల ఎత్తుతో ఏకశిల పాలరాతితో ద్యానముద్రలో ఉన్న శివుడి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పారు. ఇక్కడికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర మండలాలు, జిల్లాల ప్రజలు, భక్తులు వచ్చి శివుడిని దర్శించుకుంటారు. లక్షి్మసత్యనారాయణస్వామి విగ్రహాలు కూడా పాలరాతివే ప్రతిష్టించారు. రామలక్ష్మణులు, సీతా, హన్మంతుడి విగ్రహాలు కూడా ఇక్కడ నెలకొల్పారు. 45 ఏళ్లకిందట మామూలు గుడిగా.. గ్రామానికి చెందిన అడ్లగట్ట గంగారాం ముంబాయిలో పని చేసుకుంటుంటుండేవాడు. ఈ నేపథ్యంలో 1965లో ఆయనకు శివుడి విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చి అMý్కడే పూనేలోని పాలరాతి విగ్రహాలు తయారు చేసే ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ పాలరాతి శివుడి విగ్రహాన్ని చూసిన గంగారాం ఆ విగ్రహాన్ని తమ గ్రామంలో ఏర్పాటు చేయాలని కొనుగోలు చేశాడు. ఇక్కడికి తీసుకొచ్చి సొంతఖర్చులతో చిన్నగుడి కట్టి అందులో ప్రతిష్టించాడు. ఆలయానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి శివుడి విగ్రహంతోపాటు సత్యనారాయణస్వామి, రాముడు,సీతా, లక్ష్మణుడు, హన్మంతుడు వంటి విగ్రహాలు ఏర్పాటు చేసి ఆలయాన్ని విస్తృతపరిచారు. నవగ్రహ మంటపాన్ని కూడా ఏర్పాటు చేశారు. శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి.. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 20 నుంచి 23 వరకు నాలుగురోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 20న స్వస్తిపుణ్యహవచనం, స్థాపిత దేవతలపూజ, అభిషేకాలు, 21న స్వామివారి కల్యాణం, జాగారణ, లింగోధ్బావ, 22న రథోత్సవం, అన్నదానం, 23న బద్దిపోచమ్మకు బోనాలు ఉంటాయి. టెంపుల్ టౌన్ మంథని మంథని: ప్రాచీనచరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంత్రపురి వేదాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. వేయి సంవత్సరాలకుపైగా మహోన్నత చరిత్ర కలిగిన మంథని దేవాలయాలకు నిలయమై టెంపుల్‌టౌన్‌గా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వినాయకుడి గుడి, దక్షిణ భారతదేశంలో ఏకైక పశ్చిమ ముఖ శివలింగం మంథనిలోనే దర్శనమిస్తాయి. మంథనిలో అన్ని దేవతలకు సంబంధించిన దేవాలయాలు పురాణకాలంలోనే నిర్మించారు. మహా శివరాత్రి పర్వదినాన శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఓంకారేశ్వరుడు, శ్రీలేశ్వర సిద్దేశ్వర దేవాలయం,పశి్చమ ముఖం గల శివలింగం ఉన్నాయి. ప్రాచీన చరిత్ర కలిగిన మంథనిలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. సమాచార ఫోన్ నెంబర్లు ఇవీ.. జాతర ఉత్సవాల చైర్మన్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్– 7093364111 జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే – 8332831100 డీఎస్పీ చంద్రకాంత్‡– 8500149182 కార్యనిర్వాహణ అధికారి కృష్ణవేణి – 9491000743 ఏఈవోలు, ఉమారాణి– 9247307754 స్థానిక వైద్యాధికారి మహేశ్‌రావు– 9440078901 డీఎం ఆర్టీసీ భూపతిరెడ్డి – 9959225926 టౌన్ సీఐ సీహెచ్ శ్రీధర్– 9440795165 రాజన్న జాతర టోల్‌ఫ్రీ నంబర్. 18004252037 -
పుష్పపల్లకోత్సవం.. నయనానందకరం
సాక్షి, శ్రీశైలం: మల్లికార్జునస్వామి స్వామి పుష్పపల్లకోత్సవం కనుల పండువగా జరిగింది. దేవేరి భ్రామరితో కలిసి శ్రీశైలేశుడు పురవీధుల్లో విహరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన మల్లన్న పుష్పపల్లకీ గ్రామోత్సవాన్ని లక్షలాది మంది భక్తజనం తిలకించి తరించారు. అంతకు ముందు ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి కల్యాణమండపంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష వాహనసేవలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను ఆలయప్రదక్షిణ చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఈఓ కేఎస్‌రామారావు, మాజీ ఈఓ వంగాలశంకర్రెడ్డి, ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ శివరామిరెడ్డి,సభ్యులు గిరీష్‌పాటిల్, చాటకొండ శ్రీని వాసులు,మర్రి శ్రీరాములు, రావినాద్రావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రదక్షిణానంతరం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా రథశాల వద్దకు చేర్చి పుష్పాలంకృతశోభతో కళకళలాడుతున్న పల్లకీలో ఉత్సవమూర్తులను కూర్చొబెట్టారు. ఈ పుష్పపల్లకీ కోసం 2000 కేజీలకు పైగా తెలుపు, పసుపు చామంతులు,ఎరుపు,పసుపు బంతిపూలు, కనకాంబరం, నందివర్ధనం, కాగడా, జబ్ర, కార్నేషన్, ఆర్కిడ్స్, గ్లాడియోలస్, టైగర్రోజ్, స్టార్ రోజ్, ఆస్టర్, ఆ్రస్టిడ్ మొదలైన 18 రకాల పుష్పాలను వినియోగించినట్లు హారి్టకల్చరిస్ట్ లోకేష్ తెలిపారు. దీంతో పాటు వేలాది విడి పుష్పాల(కట్‌ప్లవర్స్)తో అత్యంత సుందరంగా పల్లకీని తీర్చిదిద్దారు. నేడు శ్రీశైలంలో... శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు గురువారం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను గజవాహనంపై ఆవహింపజేసి విశేషపూజలు చేస్తారు. తర్వాత గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపై అధిష్టింపజేసిన ఉత్సవ మూర్తులకు విశేషపూజలు చేస్తారు. వాహన సమేతులైన స్వామి అమ్మవార్లను ప్ర«ధానాలయ గోపురం నుంచి «రథశాల వద్దకు చేరుస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత నందిమండపం, అంకాలమ్మగుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగిస్తారు. గురువారం జరిగే ప్రత్యేక పూజల్లో భాగంగా ఉదయం 7.30 గంటలకు నిత్యహోమ బలిహరణలు, జపానుష్టానములు నిర్వహిస్తారు. మల్లన్న గ్రామోత్సవానికిభారీగా తరలివచ్చిన భక్తజనం మంత్రి పేర్ని నాని రాక కర్నూలు(సెంట్రల్) : రాష్ట్ర సమాచార, రోడ్డు రవాణా శాఖమంత్రి పేర్ని నాని మల్లన్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం శ్రీశైలానికి రానున్నారు. మచిలిపట్నం నుంచి గురువారం ఆయన బయలు దేరి సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. 21వ తేదీ జరిగే వివిధ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు తిరిగి మచిలిపట్నంకు వెళ్లిపోతారు. -
రాయంచపై సోమస్కంధుడి రాజసం
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లు రావణ మయూర వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమరి్పంచి, మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తి వాసులు జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. – శ్రీకాళహస్తి సాక్షి, శ్రీకాళహస్తి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరస్వామి హంస వాహనంపై, అమ్మవార్లు యాళి వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు అలంకార మండపంలో ప్రత్యేక పూజలు చేసి, విశేషాలంకరణ అనంతరం హంస వాహనంపై కొలువుదీర్చి శివగోపురం(దక్షిణద్వారం) మీదుగా వేంచేపు చేసి, పురువీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. వాహన సేవలో ఎద్దులు(నందులు) ముందు నడస్తుండగా కోలాటాలు, భజనలు, శివ సంకీర్తనలు, మంగళవాయిద్యాల నడుమ అట్టహాసంగా వాయులింగేశ్వరుడు సతీసమేతంగా పురవీధుల్లో ఊగుతూ భక్తులను కటాక్షించారు. వారితోపాటు పంచమూర్తులైన స్వామివారి కుమారులు వినాయకుడు మూషిక వాహనంపై, కుమారస్వామి నెమలి వాహనంపై, పరమ భక్తుడు భక్తకన్నప్ప, చండికేశుడు, శ్రీకాళహస్తిలు (సాలిపురుగు, పాము, ఏనుగులు) కూడా పురవీధుల్లో ఊరేగారు. భక్తులు కర్పూరహారతులిచ్చి, మొక్కులు తీర్చుకున్నా రు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖరరెడ్డి, ఆలయాధికారులు పాల్గొన్నా రు. ఈ ఉత్సవాలకు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కీర్తిశేషులు చిట్టా ప్రగడ సీతారామాంజనేయుడు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. శేష, యాళి వాహనసేవ శ్రీకాహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శేష, యాళీ వాహన సేవలు జరుగనున్నాయి. ఉద యం స్వామి, అమ్మవార్లు హంస, చిలుక వాహనాల్లో పురవీధుల్లో ఊరేగుతారు. ఈ కార్యక్రమాలకు చుక్కల నిడిగల్లు గ్రామానికి చెందిన ఎస్ఐ ముద్దుకృష్ణారెడ్డి, శ్రీకాళహస్తికి చెందిన గుప్త మెడికల్స్ అధినేత ఆనంద్‌రాజ్ గుప్త, రూపగుప్త, శ్రీకాళహస్తికి చెందిన పేట జనార్దన్‌రావు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేడు శేష, యాళి వాహనసేవ శ్రీకాహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శేష, యాళీ వాహన సేవలు జరుగనున్నాయి. ఉద యం స్వామి, అమ్మవార్లు హంస, చిలుక వాహనాల్లో పురవీధుల్లో ఊరేగుతారు. ఈ కార్యక్రమాలకు చుక్కల నిడిగల్లు గ్రామానికి చెందిన ఎస్ఐ ముద్దుకృష్ణారెడ్డి, శ్రీకాళహస్తికి చెందిన గుప్త మెడికల్స్ అధినేత ఆనంద్‌రాజ్ గుప్త, రూపగుప్త, శ్రీకాళహస్తికి చెందిన పేట జనార్దన్‌రావు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. -
సూర్యప్రభపై సోమస్కంధమూర్తి తేజస్సు
సాక్షి, శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం రాత్రి స్వామివారు భూతవాహనంపై జ్ఞానప్రసూనాంబిక అమ్మవార్లు శుక వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించి, మొక్కులు తీ ర్చుకున్నారు. అంతకు ముందు ఉభయకర్తలు వీఎంపల్లెకు చెందిన పసల రమణయ్య, పసల సుమతి కుటుంబసభ్యులతో కలిసి వీఎం పల్లె నుంచి స్వామి, అమ్మవార్లకు సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓలు మోహన్, శ్రీనివాసులు రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ రంగస్వామి, ఆలయ పర్యవేక్షకుడు సారథి, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించే సూర్యప్రభపై సోమస్కంధమూర్తి కొలువుదీరి, భక్తులను అ నుగ్రహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు అయిన మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పరంలో ఊరేగారు. ఉదయం ఆలయం యాగశాలలో కలశాలకు అర్చకులు అర్ధగిరి, ఆలయ ప్రధానార్చకులు సంబంధం గురుకుల్ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లతోపాటు పంచమూర్తులు, స్వామి ఉత్సవమూర్తులు పురవీధుల్లో ఊరేగారు.మేళ తాళాలు, కోలాటాల నడుమ పంచమూర్తులు, నందీశ్వరుడు ముందు సాగగా స్వామి, అమ్మవార్లు వాహనసేవ కోలాహలంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓలు మోహన్, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో నేడు శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ యాళీ వాహనంపై పురవీధుల్లో ఊరేగనున్నారు. ఈ ఉత్సవాలకు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన చిట్టా ప్రగడ సీతారామాంజనేయులు ఉభయకర్తగా వ్యవహరిస్తారు. రాత్రి స్వామివా రు రావణవాహనంపై, అమ్మవారు మ యూర వాహనాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉత్సవానికి జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి దంప తు లు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. -
శ్రీశైలం.. ఉత్సవ శోభితం
సాక్షి, శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం.. రావణ వాహనంపై శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహన ప్రత్యేక పూజలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ఈఓ కేఎస్ రామరావు తదితరులు పాల్గొన్నారు. విశేషపూజల అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలను చేసి నారికేళం సమరి్పంచి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. రథశాల నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం అంకాలమ్మగుడి, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు కనుల పండువగా సాగింది. లక్షలాది మంది భక్తులు రావణ వాహనా«దీశులైన స్వామిఅమ్మవార్లను పురవీధుల్లో దర్శించుకొని కర్పూర నీరాజనాలు అరి్పంచారు. రాత్రి 9.30 గంటలకు గ్రామోత్సవం ఆలయ ప్రాంగణం చేరుకుంది. మల్లన్నకు పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి బుగ్గన ఈ నెల 21వ తేదీన నిర్వహించే శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పట్టువ్రస్తాలను సమరి్పంచారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాలను సమర్పించడం ఆనవాయితీగా ఉంది. ఇందులో భాగంగా ప్రధానాలయగోపురం ముందు ఏర్పాటు చేసిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తుల ఎదుట పట్టువ్రస్తాలు, ఫలపుష్పాదులను ఉంచి శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు పూజలను నిర్వహించారు. అనంతరం మంత్రి, ఈఓ తదితరులంతా పట్టువ్రస్తాలు, ఫలపుష్పాదులను తలపై పెట్టుకుని ఆలయప్రవేశం చేశారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పట్టువస్త్రాలను సమరి్పంచిన అనంతరం వారు రావణవాహనంపై అధిష్టింపజేసిన శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సేవలో పాల్గొన్నారు. ఆత్మకూరు–దోర్నాల ఘాట్ రోడ్డు పరిస్థితిపై ఎమ్మెల్యే శిల్పాతో చర్చించామని అటవీశాఖ పరిధిలో ఉన్నందున ఆ శాఖ అధికారులు, ప్రతినిధులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. నేడు మల్లన్నకు పుష్పపల్లకీ సేవ.... మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను పుష్పపల్లకీ అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనికి ముందుగా ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలను చేస్తారు. ఉత్సవమూర్తులను గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన పుష్పపల్లకీపై అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ పుష్పపల్లకి మహోత్సవం రథశాల నుంచి నందిమండపం వద్దకు వెళ్లి తిరిగి రథశాల వద్దకు చేరుకుంటుంది. -
మయూరవాహనంపై శ్రీశైల మల్లన్నా
-
వెండి అంబారీపై పరమేశ్వరుడు..
సాక్షి, శ్రీకాళహస్తి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు సోమవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కొడి ఉత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు, పూజార్లు వేదమంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి పురాణాల్లో ఒక గాథ కూడా ఉంది. పాలసముద్రాన్ని చిలికినపుడు ఉద్భవించిన హాలాహలాన్ని మింగిన శివుడు రాక్షసుల నుంచి విశ్వాన్ని రక్షించాడు. లోకకల్యాణార్థం పరమశివుడు హాలాహలం మింగి తన కంఠంలో దాచుకుని మగత నిద్రలోకి వెళ్లిపోతారు. స్వామివారిని మేల్కొల్పేందుకు దేవతలు చేసే మొదటి ఉత్సవాన్ని ధ్వజారోహణం అని పిలుస్తారు. ఈ రాత్రిని దేవరాత్రి అని పిలుస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి వారి గర్భాలయం ఎదురుగా ఉన్న బంగారు ధ్వజస్తంభానికి ఆలయ వేదపండితులు, ప్రధానార్ఛకులు కలశాలు స్థాపించి, హోమం వెలిగించి స్వామివారి దేవేరి అయిన శ్రీజ్ఞానప్రసూనాంబ, భక్తకన్నప్ప, సుబ్రమణ్యస్వామి, వినాయకస్వామి, చండికేశుడు కలిసి పంచమూర్తులను చతురస్రాకారంలో నిలిపి పలు రకాల పుష్పాలతో విశేష రీతిలో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశాల్లోని పవిత్ర గంగా జలాలతో ధ్వజస్తంభానికి అభిషేకించారు. భక్తులు సమర్పించిన కొడి చీరలతో ధ్వజస్తంభాన్ని అలంకరించారు. ఉత్సవమూర్తులకు ఆలయ వేదపండితులు, అర్చకస్వాములు ధూపదీప నైవేద్యాలను సమరి్పంచి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. స్వామి వారి ధ్వజారోహణ పూజల్లో ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మ«ధుసూదన్ రెడ్డి దంపతులు, అంజూరుతారక శ్రీనివాసులు, డీఎస్పీ నాగేంద్రుడు, ఆలయ అర్చకస్వాములు, వేదపండితులు, ప్రధానార్చకులు సంబంధం స్వామినాథన్ గురుకుల్, కరుణాకర్ గురుకుల్, అర్ధగిరి ప్రసాద్ శర్మ, శివప్రసాద్‌శర్మ, శ్రీనివాస శర్మ, మారుతీశర్మ తదితరులతోపాటు ఆలయ ఈఈ వెంకటనారాయణ, ఇంజినీరింగ్ సిబ్బంది, ఆలయ ఏఈఓలు మోహన్, రంగస్వామి, తదితరులు పాల్గొన్నారు. «ధ్వజారోహణ పూజలకు శ్రీకాళహస్తిలోని బహుదూర్‌పేటకు చెందిన బయ్యా నాగమ్మ, ఆమె కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు సోమవారం ఉదయం స్వామీఅమ్మవార్లు, పంచమూర్తులతో కలసి పురవీధుల్లో ఊరేగారు. అలాగే ఉత్సవమూర్తులకు ముందు ఒంగోలు జాతికి చెందిన నందులు రెండు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అయితే ఈ నందులు రెండు కూడా శ్రీకాళహస్తీశ్వరాలయ గోశాలలో పుట్టి పెరిగాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవమూర్తులను రాజేంద్ర గురుకుల్ విశేషరీతిలో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు ముందు మేళతాళాలు బ్యాండ్ వాయిద్యాలు, తోరణాలు, గొడుగులు, వివిధ రకాల నాట్య కళాకారుల నృత్యాలు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ నాగేంద్రుడు, ఉభయదారులు బయ్యానాగమ్మ, ఆమె కుమారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేటి వాహన సేవలు శ్రీకాళహస్తి: శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో తిరునాళ్లు నిర్వహించనున్నారు. ఈ తిరునాళ్లను భూతరాత్రి అంటారు. ఈ సందర్భంగా స్వామివారిని నిద్రలేపేందుకు భూతగణాలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తాయని ప్రతీతి. అందుకే ఈ రాత్రిని భూతరాత్రి అని పిలుస్తారు. శ్రీస్వామిఅమ్మవార్లు ఉదయం సూర్యప్రభ, చప్పరం వాహనాలపై రాత్రి భూత–శుక వాహనాల్లో ఊరేగి, భక్తులకు దర్శన భాగ్యం కలి్పస్తారు. ప్రతి ఏటా హరిజన సేవాసంఘం వారు ఉభయదారులుగా వ్యవహరిస్తారు. అనుబంధ ఆలయాల్లో శివరాత్రి వేడుకలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న 9 శివాలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 21 శుక్రవారం విశేష అభిషేకాలు, ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పెద్దకన్నలి గ్రామంలో వెలసిన శ్రీదుర్గాంబికా సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి 24 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 20వ తేదీ కలశ స్థాపన, ధ్వజారోహణం, 21న మహా శివరాత్రి అభిషేకం, రాత్రి లింగోద్భవం, 22వ తేదీ విశేష అభిషేకం, అలంకారం, 23న స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, మధ్యాహ్నం అన్నదానం, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. 24న కలశ ఉద్వాసన, ధ్వజావరోహణం కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. ఊరందూరులో... ఊరందూరు గ్రామంలో వెలసిన శ్రీనీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో 21వ తేదీన శుక్రవారం మహాశివరాత్రి రోజున ఉదయం 8 గంటలకు అభిõÙకం, 9 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నట్టు వివరించారు. వేడాం వేయి లింగాల కోన సహస్రలింగేశ్వర స్వామి, విరూపాక్షపురంలో వెలసిన అర్ధనారీశ్వర స్వామివారి ఆలయం, చల్లేశ్వరస్వామి ఆలయం, నీలకంఠేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తి పట్టణంలో ముత్యాలమ్మ వీధిలో వెలసిన చక్రేశ్వరస్వామి ఆలయం, దుర్గమ్మ కొండ కింద ఉన్న దుర్గేశ్వరస్వామి ఆలయం(దుర్గా మల్లేశ్వర స్వామి), బొక్కిసంపాలెం గ్రామంలో వెలసిన కోదండ రామేశ్వరస్వామి ఆలయాల్లో 21వ తేదీ ఉదయం 8 గంటలకు అభిõÙకం నిర్వహిస్తామని తెలిపారు. -
మనోహరం..మయూర వాహనోత్సవం
సాక్షి, శ్రీశైలం : శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి మయూరవాహనంపై ముగ్ధమనోహరంగా భక్తులకు సో మవారం దర్శనమిచ్చారు. స్వామివార్ల దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ‘ఓం హర శంభో శంకరా... శ్రీశైల మల్లన్నా పా హిమాం.. పాహిమాం’ అంటూ పురవీధుల్లో సాగిలపడ్డారు. రాత్రి 7.30 గంటలకు అలంకార మండపంలో ఉత్సవమూర్తులను మయూర వాహనంపై అధిష్టింపజేశారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు శా్రస్తోక్తంగా వాహన పూజలను నిర్వహించారు. అనంతరం వాహన సమేతులైన శ్రీ స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగిస్తూ కృష్ణదేవరాయుల గోపురం గుండా రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి మండపం చేరుకొని తిరిగి రాత్రి 9.30గంటలకు ఆలయ ప్రాంగణం చేరింది. గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించి పునీతులయ్యారు. పట్టు వ్రస్తాల సమర్పణ.. బ్రహ్మోత్సవాల్లో శివరాత్రి పర్వదినాన జరిగే స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం, కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానాల తరపున ఆదివారం పట్టు వ్రస్తాలను సమరి్పంచారు. కాణిపాకం దేవస్థానం తరపున ఈఓ వి. దేముళ్లు , టీటీడీ దేవస్థానం తరఫు ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ , టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఆ దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి, అర్చక వేదపండిత బృందం పట్టువ్రస్తాలు, ఫలపుష్పాదులకు శాస్త్రోక్త పూజలు చేసి స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంగళవారం సాయంత్రం సంప్రదాయానుసారం పట్టువ్రస్తాలను సమరి్పంచనున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. నేటి రాత్రి 7.30 గంటల వరకే మల్లన్న స్పర్శదర్శనం భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి 7.30 వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ఆ తర్వాత నుంచి దూర (అలంకార)దర్శనం ప్రారంభిస్తామన్నారు. ఈనెల 24 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు మల్లికార్జునస్వామివార్ల దూరదర్శనం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. శివస్వాములు, సాధారణ భక్తజనంతో పాటు వీఐపీలు, వీవీఐపీలకు కూడా మల్లన్న స్పర్శదర్శనం శివరాత్రి ముగిసే వరకు ఉండబోదని స్పష్టం చేశారు. నేడు శ్రీశైలంలో... బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవరోజు మంగళవారం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను రావణవాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవా న్ని నిర్వహిస్తారు.ఉదయం 7.30గంటలకు నిత్య హోమ బలిహరణలు, జపానుష్ఠానములు, నిర్వహిస్తారు. సాయంత్రం 5.30గంటల నుంచి నిత్యపూజలు, అనుష్ఠానములు, నిత్యహవనములు, బలిహరణలను సమర్పిస్తారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి జ్ఞాపికను అందిస్తున్న శ్రీశైలం ఈఓ శ్రీశైలం అభివృద్ధికి టీటీడీ సహకారం శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి టీటీడీ సహకారం అందజేస్తుందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్వామిఅమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమరి్పంచిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివార్లకు సంప్రదాయానుసారం టీడీపీ తరపున పట్టువస్త్రాలను సమరి్పస్తున్నామన్నారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యాల కల్పనకు టీటీడీ తరపున నిధులను కూడా విడుదల చేస్తామని అన్నారు. శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి, వెంకటేశ్వరస్వామి స్వామి కృపతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. -
వైభవం: శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, శ్రీకాళహస్తి : దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం స్వామివారి భక్తుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్లతోపాటు పంచమూర్తులు, భక్తకన్నప్ప ఉత్సవమూర్తులను అలంకార మండపంలో అర్చకులు రాజేష్ గురుకుల్ ఆధ్వర్యంలో పట్టుపీతాంబరాలు, గజమాలలు, విశేషాభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తకన్నప్ప ఉత్సవమూర్తిని పల్లకిపై ఆశీనులు చేశారు. తదుపరి కైలాసగిరి పర్వతశ్రేణుల్లోని భక్తకన్నప్ప ఆలయం వరకు మేళతాళాల నడుమ పల్లకిలో ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. అక్కడ ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అర్చకులు అర్ధగిరి, సంబంధం, వరదా గురుకుల్ ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజస్తంభానికి ధ్వజపటాన్ని ఆరోహింపజేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణిరెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు బోయ కుల సంఘం నాయకులు ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం శ్రీస్వామి,అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగారు. భక్త కన్నప్ప కొండపైకి ఉత్సవమూర్తి ఊరేగింపు నేడు భవుడి ధ్వజారోహణం శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం మాఘ బహుళ నవమిని పురస్కరించుకుని స్వామి వారి ధ్వజారోహణం చేపట్టనున్నట్లు దేవస్థానం ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు పూజలు ప్రారంభమవుతాయన్నారు. ఉదయం అర్చకులు అలంకార మండపంలో స్వామి,అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. తదుపరి ఉత్సవమూర్తులను స్వామివారి సన్నిధికి ఎదురుగా ఉన్న స్వర్ణ ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేస్తారు. స్వర్ణ ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహిస్తారు. దర్బలతో చేసిన తాడును శాస్త్రోక్తంగా ధ్వజస్తంభానికి ఆరోహింపజేస్తారు. భక్తులు సమర్పించే చీరలతో కొడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కన్నప్ప ధ్వజారోహణ ఊరేగింపులో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణమ్మ, చిత్రంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సతీమణి శ్రీవాణి, కుమార్తె పవిత్ర తదితరులు -
హంస వాహనాధీశా.. హరోం హర
సాక్షి, శ్రీశైలం: శ్రీగిరి కొండలు శివ నామస్మరణతో ప్రతిధ్వనిస్తుండగా.. శ్రీశైల క్షేత్రం బ్రహ్మోత్సవ కాంతులతో కళకళ లాడుతుండగా.. దేవేరి భ్రామరితో కలసి మల్లన్న మందస్మిత దరహాస వీచికలతో హంస వాహనంపై కనులపండువగా దర్శనమివ్వగా.. హంస వాహనాధీశా.. హరోం.. హర అంటూ శివ స్వాములు ప్రణమిల్లారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఆదివారం రాత్రి శ్రీభ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి హంస వాహనంపై విశేష వాహన పూజలు అందుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న అక్కమహాదేవి అలంకార మండపంలో రాత్రి 7.30 గంటలకు హంస వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక అలంకార పూజలు, వాహన, వింజామర సేవలను వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు, వేదపండితులు పండితులు నిర్వహించారు. మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా, భక్తులు పంచాక్షరి నామస్మరణ చేస్తున్న సమయాన హంసవాహనాధీశులైన స్వామివార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి ఆలయప్రాకార ప్రధాన రాజగోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ప్రధాన పురవీధిలోని అంకాలమ్మ గుడి, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం జరిగింది. అక్కడి నుంచి నేరుగా స్వామి అమ్మవార్ల ఆలయ ప్రాంగణం చేరుకుంది. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలనర్పించారు. శివరాత్రి రోజు జరిగే బ్రహ్మోత్సవ కల్యాణానికి మొదటిసారిగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరపున ఈఓ సురేష్‌బాబు దంపతులు ఆదివారం రాత్రి పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి అమ్మవార్లకు ఫలపుష్పాదులు, పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులుతో కూడిన పళ్లాలను తలపై పెట్టుకుని ఆలయప్రదక్షిణ చేసి సమర్పించారు. నేడు శ్రీశైలంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను మయూర వాహనంపై ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేస్తారు. వాహన సమేతులైన స్వామిఅమ్మవార్లను రథశాల నుంచి నందిమండపం, అంకాలమ్మ గుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగిస్తారు. కాగా సోమవారం జరిగే ప్రత్యేక పూజల్లో భాగంగా ఉదయం 7.30 గంటలకు నిత్యహోమ బలిహరణలు, జపానుష్టానములు, నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి నిత్యపూజలు చేపడతారు. టీటీడీ తరపున పట్టువస్త్రాల సమర్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణమూర్తులకు సోమవారం తిరుమల, తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. గత కొన్నేళ్లుగా టీటీడీ దేవస్థానం తరపున శ్రీశైలంలో జరిగే శివరాత్రి, దసరా ఉత్సవాలకు పట్టువస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. కళా నీరాజనం బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామోత్సవంలో కళాకారుల అమోఘంగా తమ కళలను ప్రదర్శించడంతో భక్తులు పులకించిపోయారు. తప్పెట చిందులు, కోలాటం, డోలు కళాకారుల విన్యాసాలు, చెంచు గిరిజనుల నృత్యప్రదర్శన, గొరవయ్యల ఈల పాటల నృత్యాలు, కేరళ నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలన్ని భక్తులను తమ అలసటను మరిచిపోయేలా చేశాయి. -
కొండంత విషాదం
శ్రీకాకుళం , నెల్లిమర్ల రూరల్: అంతవరకు ఆ ఇద్దరు స్నేహితులు అక్కడే ఆడుకున్నారు. శివరాత్రి సందర్భంగా వీధిలో ఉన్న స్నేహితులతో కలిసి ఆట, పాటలతో సందడి చేశారు. రామతీర్థంలో జరుగుతున్న శివరాత్రి జాతరను చూసొద్దామనుకుని వెళ్లిన వారు బోడికొండపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ హృదయ విదారకర సంఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆదుకుంటారనుకున్న కుమారులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి సమయంలో జరగగా బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. జాతరకు వెళ్లి రోజులు గడుస్తున్నా బిడ్డలు ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న బంధువుల సహకారంతో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై స్థానికులు పోలీసులు అందించి వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం ప్రశాంత్‌నగర్‌కు చెందిన బూర కుమార్ (16), మన్నెం సాయి(14) ఇద్దరూ ప్రాణస్నేహితులు. శివరాత్రి సందర్భంగా రోజంతా ప్రశాంత్‌నగర్‌లోనే సందడిగా గడిపారు. అనంతరం రామతీర్థంలో జరగుతున్న జాతర చూద్దామని బాబామెట్టకు చెందిన అయితి నాగరాజు (26)తో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాత్రి సుమారు 1.30 సమయంలో బయలుదేరారు. సీతారామునిపేట జంక్షన్ వద్ద బైక్ పార్క్ చేసి ఎదురుగా ఉన్న బోడికొండ పైకి అడ్డదారిలో ఎక్కేందుకు ప్రయత్నించారు. కొంతదూరం వెళ్లేసరికి అదుపు తప్పడంతో ముగ్గురూ పడిపోయారు. ఈ ప్రమాదంలో బూర కుమార్, మన్నెం సాయి అక్కడికక్కడే మృతి చెందగా.. అయితి నాగరాజు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. జనసంచారం లేని ప్రాంతం కావడంతో ఎవ్వరూ ఈ ప్రమాదాన్ని గుర్తించలేదు. అపస్మారక స్థితిలో ఉన్న నాగరాజుకి బుధవారం ఉదయం కొద్దిగా తెలివి రావడంతో కొండ దిగి గట్టిగా కేకలు వేయడంతో సీతారామునిపేట గ్రామానికి చెందిన పలువురు ఆ యువకుడి వద్దకు చేరుకొని మంచినీరు అందించి విషయం తెలుసుకున్నారు. వెంటనే 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్ సీఐ రమేష్, ఎస్సై అశోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. నాగరాజు పరిస్థితి విషమం.... విజయనగరం బాబామెట్టకు చెందిన నాగరాజు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగరాజు తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోగా.. అప్పటి నుంచి పెయింటర్‌గా పనిచేసుకుంటూ కుటుం బాన్ని నెట్టుకొస్తున్నాడు. మృతదేహాల తరలింపులో ఇక్కట్లు... బోడికొండ ఎక్కేందుకు కూడా వీలుపడని ప్రాంతంలో ప్రమాదం జరగడంతో మృతదేహాలను కిందకు దించడం పోలీస్‌లకు సవాల్‌గా మారింది. మృతుల కుటుంబాల సభ్యుల సహకారంతో డోలీలపై అతికష్టం మీద ఇద్దరి మృతదేహాలను కిందకు దించారు. అప్పటికే కుమారుల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు పిల్లల మృదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. వాళ్లను ఆపడం కూడా ఎవరి తరం కాలేదు. బూర కుమార్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు లక్ష్మి, ఆది కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాగే మన్నెం సాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి రాము ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
టీడీపీ జెండాలతో కొండకు వచ్చిన ప్రభలు
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద నిర్వహించే తిరునాళ్లకు వచ్చే ప్రభలపై రాజకీయ పార్టీల జెండాలు ఉంటే సహించబోం. అంటూ రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు చేసిన హెచ్చరికలను టీడీపీ శ్రేణులు పట్టించుకున్నట్లుగా కన్పించలేదు. ఆయన ఆదేశాలను ఖాతరు చేయకుండా రెండు ప్రభల నిర్వాహకులు ఏకంగా టీడీపీ జెండాలతో తీసుకొనిరావటం గమనార్హం. సోమవారం కోటప్పకొండ వద్ద జరిగిన తిరునాళ్లకు సుమారు 11 విద్యుత్ ప్రభలు తరలిరాగా, వాటిలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వచ్చిన యడవల్లి, కమ్మవారిపాలెం గ్రామాలకు చెందిన ప్రభలు ఏకంగా తెలుగుదేశం పార్టీ జెండాలను ఏర్పాటుచేసి కొండకు తీసుకొచ్చారు. ప్రభలపై తెలుగుదేశం పార్టీ ప్రభ అంటూ బోర్డులను సైతం ఏర్పాటుచేయటం గమనార్హం. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.3 కోట్లు
శ్రీశైలం: కర్నూల్ జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మల్లన్న ఆదాయం సుమారు రూ.3 కోట్లు అని ఆలయ ఈవో నారాయణ భరత్‌గుప్త బుధవారం తెలిపారు. మల్లన్న ఉత్సవాలు ఫిబ్రవరి 17న ప్రారంభమై 27వ తేదీతో ముగిశాయి. మంగళ, బుధవారాల్లో జరిగిన హుండీల లెక్కింపులో స్వామి, అమ్మవార్లకు రూ.2, 92, 16, 000 నగదు వచ్చిందని చెప్పారు. నగదుతో పాటు 91 గ్రాముల బంగారు, 5 కేజీల 225 గ్రాముల వెండితో పాటు 494 యూఎస్ డాలర్లు, 40 కెనడా డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 5 యూఏఇ దిర్హమ్స్, 2 సింగపూర్ డాలర్లు భక్తులు కానుకగా సమర్పించారని ఆలయ ఈవో తెలిపారు.