
ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆలయ అధికారులు
సాక్షి, శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం రాత్రి స్వామివారు భూతవాహనంపై జ్ఞానప్రసూనాంబిక అమ్మవార్లు శుక వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించి, మొక్కులు తీ ర్చుకున్నారు. అంతకు ముందు ఉభయకర్తలు వీఎంపల్లెకు చెందిన పసల రమణయ్య, పసల సుమతి కుటుంబసభ్యులతో కలిసి వీఎం పల్లె నుంచి స్వామి, అమ్మవార్లకు సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓలు మోహన్, శ్రీనివాసులు రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ రంగస్వామి, ఆలయ పర్యవేక్షకుడు సారథి, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అజ్ఞాన అంధకారాన్ని తొలగించే సూర్యప్రభపై సోమస్కంధమూర్తి కొలువుదీరి, భక్తులను అ నుగ్రహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు అయిన మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పరంలో ఊరేగారు. ఉదయం ఆలయం యాగశాలలో కలశాలకు అర్చకులు అర్ధగిరి, ఆలయ ప్రధానార్చకులు సంబంధం గురుకుల్ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లతోపాటు పంచమూర్తులు, స్వామి ఉత్సవమూర్తులు పురవీధుల్లో ఊరేగారు.మేళ తాళాలు, కోలాటాల నడుమ పంచమూర్తులు, నందీశ్వరుడు ముందు సాగగా స్వామి, అమ్మవార్లు వాహనసేవ కోలాహలంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓలు మోహన్, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో నేడు
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ యాళీ వాహనంపై పురవీధుల్లో ఊరేగనున్నారు. ఈ ఉత్సవాలకు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన చిట్టా ప్రగడ సీతారామాంజనేయులు ఉభయకర్తగా వ్యవహరిస్తారు. రాత్రి స్వామివా రు రావణవాహనంపై, అమ్మవారు మ యూర వాహనాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉత్సవానికి జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి దంప తు లు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు.