Srikalahasti devastanam
-
రాయంచపై సోమస్కంధుడి రాజసం
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లు రావణ మయూర వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమరి్పంచి, మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తి వాసులు జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. – శ్రీకాళహస్తి సాక్షి, శ్రీకాళహస్తి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరస్వామి హంస వాహనంపై, అమ్మవార్లు యాళి వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు అలంకార మండపంలో ప్రత్యేక పూజలు చేసి, విశేషాలంకరణ అనంతరం హంస వాహనంపై కొలువుదీర్చి శివగోపురం(దక్షిణద్వారం) మీదుగా వేంచేపు చేసి, పురువీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. వాహన సేవలో ఎద్దులు(నందులు) ముందు నడస్తుండగా కోలాటాలు, భజనలు, శివ సంకీర్తనలు, మంగళవాయిద్యాల నడుమ అట్టహాసంగా వాయులింగేశ్వరుడు సతీసమేతంగా పురవీధుల్లో ఊగుతూ భక్తులను కటాక్షించారు. వారితోపాటు పంచమూర్తులైన స్వామివారి కుమారులు వినాయకుడు మూషిక వాహనంపై, కుమారస్వామి నెమలి వాహనంపై, పరమ భక్తుడు భక్తకన్నప్ప, చండికేశుడు, శ్రీకాళహస్తిలు (సాలిపురుగు, పాము, ఏనుగులు) కూడా పురవీధుల్లో ఊరేగారు. భక్తులు కర్పూరహారతులిచ్చి, మొక్కులు తీర్చుకున్నా రు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖరరెడ్డి, ఆలయాధికారులు పాల్గొన్నా రు. ఈ ఉత్సవాలకు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కీర్తిశేషులు చిట్టా ప్రగడ సీతారామాంజనేయుడు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. శేష, యాళి వాహనసేవ శ్రీకాహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శేష, యాళీ వాహన సేవలు జరుగనున్నాయి. ఉద యం స్వామి, అమ్మవార్లు హంస, చిలుక వాహనాల్లో పురవీధుల్లో ఊరేగుతారు. ఈ కార్యక్రమాలకు చుక్కల నిడిగల్లు గ్రామానికి చెందిన ఎస్ఐ ముద్దుకృష్ణారెడ్డి, శ్రీకాళహస్తికి చెందిన గుప్త మెడికల్స్ అధినేత ఆనంద్‌రాజ్ గుప్త, రూపగుప్త, శ్రీకాళహస్తికి చెందిన పేట జనార్దన్‌రావు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేడు శేష, యాళి వాహనసేవ శ్రీకాహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శేష, యాళీ వాహన సేవలు జరుగనున్నాయి. ఉద యం స్వామి, అమ్మవార్లు హంస, చిలుక వాహనాల్లో పురవీధుల్లో ఊరేగుతారు. ఈ కార్యక్రమాలకు చుక్కల నిడిగల్లు గ్రామానికి చెందిన ఎస్ఐ ముద్దుకృష్ణారెడ్డి, శ్రీకాళహస్తికి చెందిన గుప్త మెడికల్స్ అధినేత ఆనంద్‌రాజ్ గుప్త, రూపగుప్త, శ్రీకాళహస్తికి చెందిన పేట జనార్దన్‌రావు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. -
సూర్యప్రభపై సోమస్కంధమూర్తి తేజస్సు
సాక్షి, శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం రాత్రి స్వామివారు భూతవాహనంపై జ్ఞానప్రసూనాంబిక అమ్మవార్లు శుక వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించి, మొక్కులు తీ ర్చుకున్నారు. అంతకు ముందు ఉభయకర్తలు వీఎంపల్లెకు చెందిన పసల రమణయ్య, పసల సుమతి కుటుంబసభ్యులతో కలిసి వీఎం పల్లె నుంచి స్వామి, అమ్మవార్లకు సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓలు మోహన్, శ్రీనివాసులు రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ రంగస్వామి, ఆలయ పర్యవేక్షకుడు సారథి, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించే సూర్యప్రభపై సోమస్కంధమూర్తి కొలువుదీరి, భక్తులను అ నుగ్రహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు అయిన మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పరంలో ఊరేగారు. ఉదయం ఆలయం యాగశాలలో కలశాలకు అర్చకులు అర్ధగిరి, ఆలయ ప్రధానార్చకులు సంబంధం గురుకుల్ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లతోపాటు పంచమూర్తులు, స్వామి ఉత్సవమూర్తులు పురవీధుల్లో ఊరేగారు.మేళ తాళాలు, కోలాటాల నడుమ పంచమూర్తులు, నందీశ్వరుడు ముందు సాగగా స్వామి, అమ్మవార్లు వాహనసేవ కోలాహలంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓలు మోహన్, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో నేడు శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ యాళీ వాహనంపై పురవీధుల్లో ఊరేగనున్నారు. ఈ ఉత్సవాలకు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన చిట్టా ప్రగడ సీతారామాంజనేయులు ఉభయకర్తగా వ్యవహరిస్తారు. రాత్రి స్వామివా రు రావణవాహనంపై, అమ్మవారు మ యూర వాహనాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉత్సవానికి జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి దంప తు లు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. -
రూ.5వేలతో వీఐపీలకు రాహుకేతు పూజలు
– శ్రీకాళహస్తిలో ఆదివారం ప్రారంభం – తొలి టికెట్ కొనుగోలు చేసిన సినీదర్శకుడు కోదండరామిరెడ్డి శ్రీకాళహస్తిః చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో రూ.5వేలు టిక్కెట్ ద్వారా వీఐపీలు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తూ నూతన కౌంటర్‌ను ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఇప్పటివరకు రూ.300 టిక్కెట్ ద్వారా (శ్రీకృష్ణదేవరాయల మండపంలో), రూ.750 టికెట్ ద్వారా (బాలజ్ఞానాంబిక మండపంలో), రూ.1,500 టికెట్ ద్వారా (పాత ప్రసాదాల మండపంలో), రూ.2,500 టిక్కెట్ ద్వారా (మృత్యుంజయ మండపంలో) నాలుగు రకాలుగా రాహుకేతు పూజలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఐదో రకం టికెట్‌గా రూ.5వేలు నిర్ణయించారు. ఈ టిక్కెట్ కొన్నవారు స్వామివారి సన్నిధిలోని సహస్రలింగేశ్వరస్వామి మండపంలో రాహుకేతు సర్పదోష పూజలు చేసుకునే అవకాశాన్ని ఆదివారం నుంచి కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆలయ ఆవరణంలో ఓ కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. కాగా తొలి టిక్కెట్ సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి కొనుగోలు చేసుకుని కుటుంబసభ్యులతో సహస్రలింగేశ్వరస్వామి మండపంలో పూజలు చేయించుకున్నారు. రెండో టికెట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఓఎస్డీ సాయిప్రసాద్ కుటుంబ సభ్యులు, మూడో టెక్కెట్ కోదండరామిరెడ్డి కుమారుడు సినీనటుడు వైభవ్ కొనుగోలు చేసి కుటుంబసభ్యులతో రాహుకేతు పూజలు చేయించుకున్నారు.