పురవీధుల్లో హంస, యాళి వాహనాలపై ఊరేగుతున్న ఆదిదంపతులు
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లు రావణ మయూర వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమరి్పంచి, మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తి వాసులు జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు.
– శ్రీకాళహస్తి
సాక్షి, శ్రీకాళహస్తి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరస్వామి హంస వాహనంపై, అమ్మవార్లు యాళి వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు అలంకార మండపంలో ప్రత్యేక పూజలు చేసి, విశేషాలంకరణ అనంతరం హంస వాహనంపై కొలువుదీర్చి శివగోపురం(దక్షిణద్వారం) మీదుగా వేంచేపు చేసి, పురువీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. వాహన సేవలో ఎద్దులు(నందులు) ముందు నడస్తుండగా కోలాటాలు, భజనలు, శివ సంకీర్తనలు, మంగళవాయిద్యాల నడుమ అట్టహాసంగా వాయులింగేశ్వరుడు సతీసమేతంగా పురవీధుల్లో ఊగుతూ భక్తులను కటాక్షించారు. వారితోపాటు పంచమూర్తులైన స్వామివారి కుమారులు వినాయకుడు మూషిక వాహనంపై, కుమారస్వామి నెమలి వాహనంపై, పరమ భక్తుడు భక్తకన్నప్ప, చండికేశుడు, శ్రీకాళహస్తిలు (సాలిపురుగు, పాము, ఏనుగులు) కూడా పురవీధుల్లో ఊరేగారు. భక్తులు కర్పూరహారతులిచ్చి, మొక్కులు తీర్చుకున్నా రు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖరరెడ్డి, ఆలయాధికారులు పాల్గొన్నా రు. ఈ ఉత్సవాలకు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కీర్తిశేషులు చిట్టా ప్రగడ సీతారామాంజనేయుడు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
శేష, యాళి వాహనసేవ
శ్రీకాహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శేష, యాళీ వాహన సేవలు జరుగనున్నాయి. ఉద యం స్వామి, అమ్మవార్లు హంస, చిలుక వాహనాల్లో పురవీధుల్లో ఊరేగుతారు. ఈ కార్యక్రమాలకు చుక్కల నిడిగల్లు గ్రామానికి చెందిన ఎస్‌ఐ ముద్దుకృష్ణారెడ్డి, శ్రీకాళహస్తికి చెందిన గుప్త మెడికల్స్ అధినేత ఆనంద్‌రాజ్ గుప్త, రూపగుప్త, శ్రీకాళహస్తికి చెందిన పేట జనార్దన్‌రావు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేడు

Comments
Please login to add a commentAdd a comment