shesha vahana seva
-
రాయంచపై సోమస్కంధుడి రాజసం
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లు రావణ మయూర వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమరి్పంచి, మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తి వాసులు జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. – శ్రీకాళహస్తి సాక్షి, శ్రీకాళహస్తి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరస్వామి హంస వాహనంపై, అమ్మవార్లు యాళి వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు అలంకార మండపంలో ప్రత్యేక పూజలు చేసి, విశేషాలంకరణ అనంతరం హంస వాహనంపై కొలువుదీర్చి శివగోపురం(దక్షిణద్వారం) మీదుగా వేంచేపు చేసి, పురువీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. వాహన సేవలో ఎద్దులు(నందులు) ముందు నడస్తుండగా కోలాటాలు, భజనలు, శివ సంకీర్తనలు, మంగళవాయిద్యాల నడుమ అట్టహాసంగా వాయులింగేశ్వరుడు సతీసమేతంగా పురవీధుల్లో ఊగుతూ భక్తులను కటాక్షించారు. వారితోపాటు పంచమూర్తులైన స్వామివారి కుమారులు వినాయకుడు మూషిక వాహనంపై, కుమారస్వామి నెమలి వాహనంపై, పరమ భక్తుడు భక్తకన్నప్ప, చండికేశుడు, శ్రీకాళహస్తిలు (సాలిపురుగు, పాము, ఏనుగులు) కూడా పురవీధుల్లో ఊరేగారు. భక్తులు కర్పూరహారతులిచ్చి, మొక్కులు తీర్చుకున్నా రు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖరరెడ్డి, ఆలయాధికారులు పాల్గొన్నా రు. ఈ ఉత్సవాలకు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కీర్తిశేషులు చిట్టా ప్రగడ సీతారామాంజనేయుడు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. శేష, యాళి వాహనసేవ శ్రీకాహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శేష, యాళీ వాహన సేవలు జరుగనున్నాయి. ఉద యం స్వామి, అమ్మవార్లు హంస, చిలుక వాహనాల్లో పురవీధుల్లో ఊరేగుతారు. ఈ కార్యక్రమాలకు చుక్కల నిడిగల్లు గ్రామానికి చెందిన ఎస్ఐ ముద్దుకృష్ణారెడ్డి, శ్రీకాళహస్తికి చెందిన గుప్త మెడికల్స్ అధినేత ఆనంద్రాజ్ గుప్త, రూపగుప్త, శ్రీకాళహస్తికి చెందిన పేట జనార్దన్రావు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేడు శేష, యాళి వాహనసేవ శ్రీకాహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శేష, యాళీ వాహన సేవలు జరుగనున్నాయి. ఉద యం స్వామి, అమ్మవార్లు హంస, చిలుక వాహనాల్లో పురవీధుల్లో ఊరేగుతారు. ఈ కార్యక్రమాలకు చుక్కల నిడిగల్లు గ్రామానికి చెందిన ఎస్ఐ ముద్దుకృష్ణారెడ్డి, శ్రీకాళహస్తికి చెందిన గుప్త మెడికల్స్ అధినేత ఆనంద్రాజ్ గుప్త, రూపగుప్త, శ్రీకాళహస్తికి చెందిన పేట జనార్దన్రావు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. -
గోవిందా శ్రిత గోకులనందా
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి చిన్న శేష వాహనంపై శ్రీకృష్ణావతారంలో భక్తులను కటాక్షించారు. పట్టు పీతాంబరాలు, మరకత మాణిక్యాదుల విశేషాభరణాలు, పరిమళాలు వెదజల్లే పుష్పమాలలు ధరించి ఐదు శిరస్సుల శేషుని నీడన వేణువు చేతబట్టి మురళీకృష్ణుడి రూపంలో తిరువీధుల్లో విహరించారు. ఊరేగింపు ముందు గజరాజులు, అశ్వాలు, నందులు కదులుతుండగా.. జీయర్ స్వాములు దివ్య ప్రబంధ గానం ఆలపిస్తుండగా.. భజన, కళాబృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11వరకు వాహన సేవ జరిగింది. అశేష భక్తుల గోవిందనామస్మరణతో తిరువీధులు మార్మోగాయి. రాత్రి హంస వాహనంపై సరస్వతీదేవి అలంకారంలో స్వామివారు కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. –సాక్షి, తిరుమల నేటి వాహన సేవలు ఉదయం : సింహ వాహనం బ్రహ్మోత్సవాలలో మూడోరోజు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సింహ వాహనంపై శ్రీవేంకటేశ్వరుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. జంతువులకు రాజైన సింహం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహ వాహన శక్తికి, గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఆర్యోక్తి. రాత్రి : ముత్యపు పందిరి వాహనం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు విహరించనున్నారు. సుకుమారసేవగా ముత్యపు పందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈవాహనం ద్వారా స్వామి వారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తారు.రాత్రి 9గంటలకు తిరువీధుల్లో ఈ వాహన సేవ ప్రారంభమై 11వరకు సాగుతుంది. భక్త వాణి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ కల్పిస్తున్న వసతులు వారి మాటల్లో.. తిరుపతి (అలిపిరి)/అర్బన్ కనులారా దర్శించుకున్నాం తిరుమల శ్రీవారిని కనులారా దర్శించుకున్నాం. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు అద్భుతంగా ఉన్నాయి. హరినామ సంకీర్తన , సాంస్కృతిక ప్రదర్శనల నడుమ వాహన సేవలు కట్టిపడేస్తున్నాయి. టీటీడీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. – శ్రీనివాస్, వేలూరు, తమిళనాడు వాహన సేవలో తరించాం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం చిన్నశేష వాహన సేవలో పాల్గొన్నా.. గోవిందనామ స్మరణ మధ్య వాహన సేవలో శ్రీనివాసున్ని దర్శించుకున్నాం. గత బ్రహ్మోత్సవాలకు వచ్చాం. కానీ వాహన సేవను కనులారా చూడలేకపోయాం. ఈ సారి శ్రీవారిని దగ్గర నుంచి చూసే భాగ్యం కలిగింది. – వైఎస్ దేవేంద్ర, రాణిపేట, తమిళనాడు ఆర్జిత సేవలకు లాటరీ సరికాదు తిరుమలలో ఆర్జిత సేవలకు లాటరీ విధానం రద్దు చేయాలి. ఆన్లైన్ విధానంలో ఆర్జిత సేవలను భక్తలకు అందించాలి. క్యూలైన్లలో తోపులాట జరుగుతోంది, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు రెండు లైన్లలో క్యూలో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుంది.– గౌరీదేవి, హైదరాబాద్ మెరుగైన వసతులు కల్పించాలి భక్తులకు మెరుగైన సేవలందించేలా టీటీడీ చర్యలు తీసుకోవాలి. తిరుమలకు వచ్చే భక్తులకు సులభంగా వసతి కల్పించాలి. చంటి బిడ్డలతో తిరుమలకు వచ్చే వారికి మంచి సౌకర్యాలు కల్పించాలి. – పుష్పావతి, విజయవాడ విద్దుదీపాలంకరణ చాలాæ బాగుంది తిరుమల క్షేత్రంలో విద్యుద్దీపాలంకరణ బాగుంది. రాత్రివేళల్లో శ్రీవారి నమూనాలు, కటౌట్లు, ఆర్చిలు దేదీప్యమానంగా వెలుగుతూ కనువిందు చేస్తున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంటే తిరుమల గిరుల్లోనే చూసి తరలించాలి. అందుకే ఏటా బ్రహ్మోత్సవాలకు వస్తున్నాం – శిరీష, అమలాపురం -
మన్యంకొండలో వైభవంగా శేషవాహన సేవ
దేవరకద్ర రూరల్ : మన్యంకొంలోని లక్ష్మీవేంటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం అర్ధరాత్రి స్వామివారి శేష వాహనసేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామి దంపతుల విగ్రహాలను ఉంచి గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల బంగారు ఆభరణాలు, రకరకాల పూలతో స్వామి దంపతులను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. స్వామివారిని మళ్లీ గర్భగుడి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక అభిషేకాలు, అర్చన నిర్వహించారు. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని పుష్కరాలకు వెళ్లే చాలా మంది భక్తులు అంతకుముందు జరిగిన స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని రాత్రి ఇక్కడే బస చేశారు. దీంతో మన్యంకొండలో భక్తుల రద్దీ కనిపించింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఆళహరి నారాయణస్వామి, సభ్యుడు మధుసూదన్కుమార్, ఈఓ కె.శ్రీనివాసమూర్తి, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు.