మల్లన్న హుండీ ఆదాయం రూ.3 కోట్లు | srisailam mallana swamy income was 3 crores | Sakshi
Sakshi News home page

మల్లన్న హుండీ ఆదాయం రూ.3 కోట్లు

Published Wed, Mar 1 2017 10:27 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

srisailam mallana swamy income was 3 crores

శ్రీశైలం: కర్నూల్‌ జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మల్లన్న ఆదాయం సుమారు రూ.3 కోట్లు అని ఆలయ ఈవో నారాయణ భరత్‌గుప్త బుధవారం తెలిపారు.  మల్లన్న ఉత్సవాలు ఫిబ్రవరి 17న ప్రారంభమై 27వ తేదీతో ముగిశాయి. మంగళ, బుధవారాల్లో జరిగిన హుండీల లెక్కింపులో స్వామి, అమ్మవార్లకు రూ.2, 92, 16, 000 నగదు వచ్చిందని చెప్పారు. నగదుతో పాటు 91 గ్రాముల బంగారు, 5 కేజీల 225 గ్రాముల వెండితో పాటు 494 యూఎస్‌ డాలర్లు, 40 కెనడా డాలర్లు, 20 ఇంగ్లాండ్‌ పౌండ్లు, 5 యూఏఇ దిర్హమ్స్, 2 సింగపూర్‌ డాలర్లు భక్తులు కానుకగా సమర్పించారని ఆలయ ఈవో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement