
కిటకిటలాడిన కోటప్పకొండ
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. స్వామి వారి మూలవిరాట్‌కు విరివిగా అభిషేకాలు జరిగాయి. నాగేంద్రునడి పుట్ట, ధ్యానశివుడి విగ్రహం వద్ద కూడా విశేష పూజలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈవో డి.శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.