రామ్‌లల్లా అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువైన దరిమిలా తన మొదటి హోలీని జరుపుకుంటున్నాడు. రంగుల పండుగ సందర్భంగా బాలరాముని మనోహర విగ్రహం పూలతో అలంకృతమయ్యింది. బాలరాముని నుదిటిపై గులాల్ పూశారు. గులాబీ రంగు దుస్తులతో రామ్‌లల్లా విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హోలీ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రామ్‌లల్లాను దర్శించుకునేందుకు ఆలయంలో బారులతీరారు.
రంగుల పండుగ హోలీ సందర్భంగా ఆలయ ట్రస్టు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ధార్మిక నగరి అయోధ్యలో ఎక్కడ చూసినా హోలీ సందడి కనిపిస్తోంది. అయోధ్యలో గత ఏకాదశి నుంచి హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. రామనగరిలో కొలువైన దేవతలు, రుషులకు రంగులు పూశారు. రాముని పరమ భక్తుడైన హనుమంతునికి కూడా హోలీ రంగులను పూశారు.
Comments
Please login to add a commentAdd a comment