నిదానంపాటి అమ్మ వారి గుడిలో ఆదివారం అదృశ్యమైన మగశిశువు ఆచూకీ కోటప్పకొండలో లభ్యమైంది.
నిదానంపాటి అమ్మ వారి గుడిలో ఆదివారం అదృశ్యమైన మగశిశువు ఆచూకీ కోటప్పకొండలో లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు తల్లిదండ్రుల నుంచి ఆడిస్తామని తీసుకుని వారు ఏమరపాటుగా ఉన్న సమయంలో బాలుడిని అపహరించారు. కోటప్పకొండలో దుండగుల వద్ద బాలుడిని చూసిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు తెలపడంతో విషయం బయటికి వచ్చింది. పోలీసులు నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.