Kidnapper
-
కిడ్నాపర్ ను విడిచి వెళ్లనంటున్న బాలుడు
-
‘పాపం.. ఆ పసి మనసుకేం తెలుసు!’
Viral Story: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కథనాలకు తలాతోక ఉండదు. నిజనిర్ధారణ(Fact Check) చేసుకోకుండా పోస్టులు పెడుతుంటారు కొందరు. అలాగే.. ఆ పోస్టుల ఆధారంగా మీమ్స్ సైతం వస్తున్న రోజులివి. తాజాగా సిసింద్రీ క్లైమాక్స్‌ను గుర్తు చేస్తోందంటూ ఓ ఘటన నెట్టింట హల్చల్ చేస్తోంది.వైరల్ వీడియోలో ఏముందంటే..పోలీస్ స్టేషన్లో.. ఓ వ్యక్తి చెర నుంచి రెండేళ్ల ఓ చిన్నారిని విడదీస్తారు పోలీసులు. ఆ టైంలో ఆ చిన్నారి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుంటాడు. అయినా పోలీసులు బలవంతంగా లాక్కుంటారు. ఆ చిన్నారి ఏడుపుతో పాటు కిడ్నాపర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా ఆ బిడ్డను బయటకు తీసుకెళ్లాక.. ఓ మహిళకు అప్పగిస్తారు. ఆమెతో పాటు ఓ వ్యక్తి, వృద్ధజంటను ఆ బాలుడి గురించి ఆరా తీస్తారు. అయినా ఆ చిన్నారి లోపల ఉన్న కిడ్నాపర్ కోసం గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటాడు.Jaipur- A #child who was #kidnapped at 11 months old and kept with the kidnappers for 14 months, hugged the kidnapper, Tanuj, and began crying loudly when he was finally #rescued.This emotional moment even brought tears to the eyes of the accused."pic.twitter.com/UUpAAspTfG— Chaudhary Parvez (@ChaudharyParvez) August 30, 2024అయితే ఆ బిడ్డకు అతనే తండ్రి అని, విడిపోయిన నేపథ్యంలో భార్య అతనిపై కేసు పెట్టిందని ఓ ప్రచారం జరుగుతోంది. అలాగే.. కిడ్నాపర్ మీద మమకారం పెంచుకుని అలా ఆ చిన్నారి ఏడ్చాడంటూ మరో ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందులో ఏది నిజమంటే..అసలు విషయం ఏంటంటే..ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు తనూజ్ చాహర్(33).ఆ వీడియోలో ఉన్న చిన్నారి పేరు పృథ్వీ. ఆగ్రాకు చెందిన తనూజ్ గతంలో అలీఘడ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశాడు. కారణం తెలియదుగానీ.. అతను సస్పెన్షన్‌లో ఉన్నాడు. అయితే.. ఆ చిన్నారి తల్లి పూనమ్ చౌదరితో అతనికి పరిచయం ఉంది. ఈ క్రమంలో తనతో వచ్చేయాలని ఆమెపై ఒత్తిడి చేశాడతను. ఆమె ఒప్పుకోకపోవడంతో.. కోపం పెంచుకుని ఆమె 11 నెలల కొడుకును ఎత్తుకెళ్లాడు.అలా సుమారు 14 నెలలపాటు ఆ బిడ్డతో ఎవరికీ దొరక్కుండా తిరిగాడు తనూజ్. పోలీసుగా తనకు ఉన్న అనుభవం ఉపయోగించడంతో పాటు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డం పెంచుకుని తిరిగాడు. ఆ బిడ్డను తన బిడ్డగా అందరికీ చెప్పుకుంటూ.. మధుర, ఆగ్రా, బృందావన్.. అన్నిచోట్లా తిరిగాడు. యమునా నది తీరాన ఓ గుడిసె వేసుకుని తనను తాను ఓ సాధువుగా అందరినీ నమ్మించే యత్నం చేశాడు. చివరకు ఈ మధ్య అలీగఢ్‌లో అతని జాడను గుర్తించిన జైపూర్ పోలీసులు.. 8 కిలోమీటర్లపాటు ఛేజ్ చేసి పట్టుకున్నాడు.తల్లిదండ్రులకు దూరం చేసిన ఆ వ్యక్తితో ఏడాది పాటు ఉన్న పృథ్వీ.. ఇన్నాళ్లు తనని సాకినందుకు ఆ కిడ్నాపర్‌పైనే మమకారం పెంచుకుని రోదిస్తుండడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. -
కృష్ణవేణి దొరికింది.. చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన రాజేశ్వరీ, భరత్ దంపతుల కుమార్తె కృష్ణవేణి (4) కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బుధవారం రాత్రి చాక్లెట్ కోసం దుకాణానికి వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లితండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. స్థానిక యువకులు అదే ప్రాంతంలోని ఓ సినిమా థియేటర్లో పనిచేస్తున్న మతి స్థిమితం లేని వ్యక్తి సురేష్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సురేష్, చిన్నారి కృష్ణవేణి ఫొటోలను అన్ని పీఎస్‌లు, చైల్డ్వెల్ఫేర్ సంస్థలు, రైల్వే పోలీసులకు పంపారు. మల్కాజ్గిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేశ్‌రెడ్డి, స్థానిక సీఐ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా సురేష్ కృష్ణవేణిని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఘట్కేసర్ నుంచి గూడ్స్ రైలులో ఖాజీపేట్ వెళ్లిన సురేష్ ఏమి చేయాలో తెలియక మరో రైలెక్కి తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అప్పటికే సమాచారం అందుకున్న రైల్వే రక్షణ పోలీసులు, చైల్డ్ గైడెన్స్ సెంటర్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని చిన్నారిని తమ రక్షణలోకి తీసుకున్నారు. ఘట్కేసర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చిన్నారి ఫొటోను తల్లితండ్రులకు పంపించి సరిచూసుకున్నారు. దీంతో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్స్ అశోక్ సికింద్రాబాద్ వెళ్లి చిన్నారిని తీసుకు వచ్చారు. అనంతరం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్వయంగా చిన్నారిని తల్లితండ్రులకు అప్పగించారు. ఘాట్ కేసర్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. కిడ్నాపర్ నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిందితుడు సురేష్, చిన్నారిని గుర్తించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో బుధవారం రాత్రి నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మేడ్చల్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటూ చిన్నారి కనిపించికుండా పోయింది. బాలిక కృష్ణవేణి రాత్రి షాప్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి, కిడ్నాపర్ నుంచి పాపను కాపాడారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు చిన్నారిని సురక్షితంగా కాపాడారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
ఎట్టకేలకు.. తల్లి ఒడిలోకి
-
ఎట్టకేలకు.. తల్లి ఒడిలోకి
- బాలుడిని రూ. 5 లక్షలకు అమ్మిన కిడ్నాపర్లు - 20 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు కరీంనగర్ రూరల్/క్రైం: సంచలనం సృష్టించిన పసి బాలుడు కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. కరీంనగర్ మండలం చామన్‌పల్లికి చెందిన వడ్లకొండ్ల రమ్య, ప్రవీణ్ దంపతుల బాబుని మంగళవారం ఓ మహిళ, యువకుడు కలసి చల్మెడ ఆనందరావు ఆస్పత్రి నుంచి కిడ్నాప్ చేయడం తెలిసిందే. తీగల గుట్టపల్లి లో మంగళవారం అర్ధరాత్రి దాటాక బాలుడి ఆచూ కీని కనిపెట్టిన పోలీసులు.. తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. బాలుడిని 20గంటల తర్వాత అప్పగించడంతో రమ్య, ప్రవీణ్ ఆనందంలో మునిగిపోయారు. బాలుడు క్షేమంగా దొరకడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స: కిడ్నాప్‌కు గురైన బాలుడు డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురి కాగా ఐసీయూలో చికిత్స అందిస్తున్నా రు. బాలుడికి పాలు పట్టించకపోవడం తోపాటు ఎండ తీవ్ర తకు చర్మం వడలి పోయింది. బాలుడిని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని మహిళ మరో వ్యక్తితో కలిసి చొప్పదండిలోని ఓ కుటుంబానికి రూ. 5 లక్షలకు విక్రయించినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌ని ఛేదించేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో యత్నిస్తుండడంతో బాలు డిని కొన్న వ్యక్తులు ఆందోళనకు గురై ఓ మధ్యవర్తి ద్వారా బాలుడిని పోలీసులకు అప్పగించి నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ వాసీం ద్వారా బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
ఫర్ సేల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: దంపతుల్లో సంతానలేమి సమస్య లేమి సమస్య చిన్నారుల అమ్మకాలు పెరిగి పోవడవానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సంతానం కోసం తపించిపోతున్న దంపతులను కిడ్నాపర్లు ముందుగా గుర్తిస్తారు. వారిని మాయమాటలతో బుట్టలో వేసుకుంటారు. ఎంత డబ్బైనా ఫరవాలేదు బిడ్డ కావాలి అనే దంపతులతో ముందుగానే ఒక ఒప్పందం కుదుర్చుకుని తగిన చిన్నారుల కోసం అన్వేషిస్తారు. చిన్నారులను అంగడి సరుకుగా మార్చే వారికి అన్నీ అనుకూలిస్తే కొనుగోలు చేయడం, లేకుంటే ఎత్తుకెళ్లడం... ఈ రెండు మార్గాలు. మరో దారుణమైన విషయం ఏమిటంటే సంతానం కావాలనే దంపతులకే కాదు, భిక్షమెత్తేందుకు, బాల కార్మికులుగా మార్చేందుకు, వ్యభిచార గృహాలకు అమ్మివేసేందుకు, ఆసుపత్రులకు అప్పగించి అవయవాలను కాజేసేందుకు కూడా చిన్నారుల కిడ్నాప్‌లు సాగుతున్నాయిం. గగుర్పొడిచే విషయం మరొకటి ఏమిటంటే మూఢ నమ్మకాలతో గుప్త నిధుల కోసం అన్వేషించే వారు నరబలులు ఇవ్వాలని భావిస్తే ఇలాంటి రాక్షసులకు సైతం చిన్నారుల సరఫరా సాగిపోతోంది. చిన్నారులను అమ్మకానికి పెట్టే ముఠా సభ్యులు ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని డబ్బు వల విసురుతారు. రోడ్డువారగా నిద్రించి కుటుంబాలపై గురిపెట్టి రాత్రివేళ తల్లిపక్కన హాయింగా నిద్రపోతున్న పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళతారు. మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబమంతా తరలివచ్చి ఆలయాల్లో నిద్రించే భక్తుల వద్ద నుంచి చిన్నారులను తస్కరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, బస్, రైల్వేస్టేషన్లలో తల్లిదండ్రుల పక్కన పడుకుని కునుకు తీస్తున్న చిన్నారులు కూడా కిడ్నాపర్ల బారిన పడుతున్నారు. తిరునెల్వేలి జిల్లా కీళప్పావురైకి చెందిన అరుణాచలం రూ.2.5 లక్షలకు ఒక మగ బిడ్డ, ఇద్దరు మహిళలు సహా ఏడుగురుని మార్తాండంకు చెందిన విల్సన్ అనే వ్యక్తికి అమ్మారు. అనుమానంతో సదరు విల్సన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది. కొన్ని నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కేసులో మొత్తం 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వీరిచ్చిన సమాచారంతో ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బాలల శరణాలయంలో చేర్చారు. గత ఏడాది తిరునెల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి తదితర జిల్లాలకు పరిమితమైన చిన్నారుల కిడ్నాప్, అమ్మకాల భూతం రాష్ట్రమంతా వ్యాపించి విశ్వరూపం దాల్చింది. ఈరోడ్, తిరుప్పూరు, కోయంబత్తూరు జిల్లాలకు చెందిన కొందరు వ్యక్తులు సైతం చిన్నారుల కిడ్నాప్, అమ్మకాలనే వృత్తిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నిరోధానికి హైకోర్టు సూచనలు ప్రజలను భయంకపితులను చేసేలా పెరిగిపోతున్న కిడ్నాప్‌లను నిరోధించడం ఎలా అనే అంశంపై మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. జిల్లాల వారీగా ప్రత్యేక పోలీసు బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మేలో ఆదేశించింది. అపహరించిన చిన్నారులు రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్లిపోతున్నందున రాష్ట్ర స్థారుులో ప్రత్యేక విచారణ కమిటీని నియమించాలని బాలల హక్కుల సంరక్షణ సమితుల వారు సూచిస్తున్నారు. చైల్డ్‌లైన్ పథకాన్ని అమలు చేస్తున్న శరణాలయం డెరైక్టర్ జయబాలన్ మాట్లాడుతూ గత 11 నెలల్లో బాలల హక్కులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుల్లో 600 మందికి అవసరమైన సహాయాన్ని అందించినట్లు తెలిపారు. అలాగే వీటిల్లో 35 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని, ఇద్దరు చిన్నారులను రక్షించగలిగామని చెప్పారు. శిశు, మహిళ కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు వచ్చేనెలలో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ చెబుతున్నారు. అత్యవసర ఫోన్: 1098 చిన్నారులు, మహిళలు కిడ్నాప్‌లకు గురైనపుడు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్ 1098 టోల్‌ఫ్రీ ఫోన్‌కు సమాచారం ఇవ్వవచ్చు. తమిళనాడులో శివగంగై, వేలూరు తదితర 30 జిల్లాల్లో చైల్డ్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నారుు. భయపెడుతున్న సర్వే జాతీయ స్థారుులో జరిగిన ఒక సర్వే ప్రకారం 2014లో తమిళనాడులో 441 మంది చిన్నారులు కిడ్నాప్‌కు గురయ్యారు. 2015లో ఈ సంఖ్య 526కు పెరిగింది. ఇక ఈ ఏడాదిలో నవంబరు వరకు 400 మందికి పైగా అపహరణకు గురయ్యారు. భారత దేశంలో చిన్నారులకు సంబంధించిన నేరాలు గతంలో కంటే 24 శాతం పెరిగిపోరుునట్లు ఆ సర్వే చెబుతోంది. చిన్నారుల కిడ్నాప్ 43 శాతం, లైంగిక వేధింపులు 30 శాతానికి పెరిగిపోయింంది. గడిచిన ఏడాదిలో చిన్నారులపై అకృత్యాలకు సంబంధించి 6,406 కేసులు నమోదయ్యాయిం. వీటిల్లో తమిళనాడులో 16.6 శాతం, మధ్యప్రదేశ్‌లో 13.2 శాతం, ఢిల్లీలో 12.8 శాతం, బిహార్‌లో 6.7 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 6.7 శాతం లెక్కన బాధిత బాలబాలికల ఫిర్యాదులతో నేరాలు నమోదయ్యాయిం. చిన్నారుల హత్యల్లో దేశస్థాయింలో తమిళనాడు మూడోస్థానంలో ఉంది. రాష్ట్రంలో సగటున రోజుకు ఇద్దరు పిల్లలు కిడ్నాపర్ల బారిన పడుతున్నారు. -
అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యం
నిదానంపాటి అమ్మ వారి గుడిలో ఆదివారం అదృశ్యమైన మగశిశువు ఆచూకీ కోటప్పకొండలో లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు తల్లిదండ్రుల నుంచి ఆడిస్తామని తీసుకుని వారు ఏమరపాటుగా ఉన్న సమయంలో బాలుడిని అపహరించారు. కోటప్పకొండలో దుండగుల వద్ద బాలుడిని చూసిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు తెలపడంతో విషయం బయటికి వచ్చింది. పోలీసులు నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. -
కర్నూల్లో కిడ్నాపర్ అరెస్ట్
-
కిడ్నాపర్లను పట్టించిన ఎస్సెమ్మెస్
హిమాయత్‌నగర్: ఒక్క ఎస్సెమ్మెస్సే కిడ్నాపర్లను పట్టించింది. పోలీసులు బాలుడి కిడ్నాపర్ల చెరనుంచి విముక్తి కలిగించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, నారాయణగూడ పోలీసులు సంయుక్తగా నిర్వహించిన ఈ ఆపరేషన్ వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. హిమాయత్‌నగర్ 3వ వీధిలో నివసించే ఎల్.నరేందర్ నారాయణగూడ వై- జంక్షన్లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతని చిన్న కుమారుడు సంజిత్ నారాయణగూడ వెంకటేశ్వర కాలనీలో ట్యూషన్‌కు వెళ్తుండగా మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఐదు బృందాలుగా విడిపోయి నగరంలోని అన్ని బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేశారు. రూ. 50 లక్షల ఇవ్వాలని సంక్షిప్త సందేశం... రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి దాటాక బాలుడి తండ్రి నరేంద్రకు ఓ ఎస్సెమ్మెస్ వచ్చింది. అప్పటి వరకు నిందితులను పట్టుకొనేందుకు సరైన క్లూ లేక తలలు పట్టుకొన్న పోలీసులకు ఆ ఎస్సెమ్మెస్ కొండంత బలాన్ని ఇచ్చింది. దాని ఆధారంగా దుండగుల కోసం వేట మొదలెట్టారు. కిడ్నాపర్లు బోయినపల్లి పీఎస్ పరిధిలోని అస్మత్పేటలోని ఓ ఇంటిలో చిన్నారి సంజిత్ను దాచిపెట్టారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బుధవారం ఉదయం పంజగుట్ట, సికింద్రాబాద్ మధ్య తిరిగారు. చివరకు పోలీసులు ప్రధాన నిందితుడు విజయకుమర్తో పాటు హేమంత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా బాలుడి ఆచూకీ చెప్పారు. వెంటనే పోలీసులు వెళ్లి బాలుడి రక్షించారు. ఈ ఆపరేషన్‌లో అబిడ్స్ ఏసీపీ రాఘవేంద్రరెడ్డి, నారాయణగూడ ఇన్స్పెక్టర్ భీంరెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈజీ మనీకోసం... సంజిత్ను మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్లకు చెందిన విజయకుమార్(26) కిడ్నాప్ చేశాడు. ఆరేళ్ల క్రితం విజకుమార్ కిడ్నాప్‌కు గురైన సంజిత్ తండ్రి మెడికల్ షాపులో పని చేసి మానేశాడు. ప్రస్తుతం సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. ఇతను హరిత (36) అనే జూనియర్ ఆర్టిస్ట్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ సులభంగా డబ్బు సంపాదించేందుకు సంజిత్ కిడ్నాప్‌కు పథకం వేశాడు. తనకు సహకరిస్తే ఒక్కొక్కరికి రూ. 20 వేలు ఇస్తానని హరిత, ఆమె కొడుకు హేమంత్‌కుమార్ (22), కూతురు స్వాతి (18), ఆటో డ్రైవర్ సయ్యద్ మున్నాతో ఒప్పందం చేసుకున్నాడు. మంగళవారం రాత్రి 9 గంటలకు బాలుడ్ని కిడ్నాప్ చేసుకెళ్లారు. చివరకు పోలీసులకు చిక్కారు. -
తండ్రి చెంతకు చేరిన చిన్నారి శ్రేయ
రాజమండ్రి క్రైం :బెంగళూరు సమీపంలోని బెల్గాంలోని విజయపురి టౌన్ నుంచి అపహరణకు గురైన శ్రేయ చివరకు తన తండ్రి వద్దకు చేరుకుంది. సెల్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్ చందప్పను గుర్తించిన రాజమండ్రి టూ టౌన్ క్రైం పోలీసులు శ్రేయను సోమవారం రక్షించిన విషయం తెలిసిందే. ఆ చిన్నారిని రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణ పర్యవేక్షణలో కేవీ స్టేట్ హోమ్‌లో ఉంచారు. శ్రేయ తండ్రి ఉమేష్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. తండ్రిని చూడగానే చిన్నారి శ్రేయ కన్నీటితో ‘పప్పా’ అంటూ హత్తుకుపోయింది. కన్నబిడ్డ ఎనిమిది రోజులుగా కనిపించకపోవడంతో తల్లడిల్లిన ఉమేష్.. ఎట్టకేలకు తన కుమార్తెను చూసి ఉద్విగ్నతకు గురయ్యారు. ఇదీ కిడ్నాప్ నేపథ్యం బెంగళూరు విజయపురి టౌన్ సీఐ ఎస్.మహేష్‌కుమార్ కథనం ప్రకారం.. తన భార్య ఆస్తిని తనకు తెలియకుండా విక్రయించారని ఉమేష్‌పై చందప్ప కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 15న ఉమేష్, ఆయన భార్య యథావిధిగా ఉద్యోగాలకు వెళ్లారు. కుమార్తె శ్రేయను ఉమేష్ తల్లి చూసుకుంటున్నారు. ఆ సమయంలో ఉమేష్ ఇంటికి చందప్ప వెళ్లాడు. ఉమేష్ తల్లి నుంచి శ్రేయను తీసుకొని, చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకువెళ్లాడు. ఉమేష్ దంపతులు ఇంటికి వచ్చిన తర్వాత కుమార్తె గురించి ఆరా తీయగా చందప్ప తీసుకెళ్లిన విషయం తెలిసింది. ఎంతసేపటికీ శ్రేయను తీసుకురాకపోవడం, అదే సమయంలో ఉమేష్‌కు చందప్ప ఫోన్ చేసి, తన ఆస్తి తిరిగి ఇవ్వాలని లేదా పరిష్కారం చూపాలని లేకుంటే శ్రేయను వదలనని బెదిరించాడు. దీనిపై ఉమేష్ విజయపురి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచీ శ్రేయను పలు ప్రాంతాల్లో తిప్పిన చందప్ప సోమవారం రాజమండ్రి చేరుకున్నాడు. స్థానిక కుమారి థియేటర్ సమీపంలో అతడి సెల్ సిగ్నల్ ట్రేస్ కావడంతో బెంగళూరు పోలీసులు రాజమండ్రి ఎస్పీ హరికృష్ణకు విషయం తెలిపి, సహకరించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎస్పీ పోలీసులను అప్రమత్తం చేసి, కిడ్నాపర్ చందప్పను అదుపులోకి తీసుకుని, శ్రేయను కాపాడారు. కిడ్నాపర్ చందప్పను బెంగళూరు పోలీసులకు అప్పగించారు. వారు అతడిని తమవెంట తీసుకువెళ్లారు. పోలీసులకు జీవితాంతం రుణపడి ఉంటా : ఉమేష్ తన కుమార్తెను రక్షించడంలో కృషి చేసిన బెంగళూరు, ఆంధ్ర పోలీసులు చాలా సహకరించారని శ్రేయ తండ్రి ఉమేష్ అన్నారు. పోలీసులకు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చందప్పకు సంబంధించిన ఆస్తి విలువ రూ.6 లక్షలుంటుందని, అది కుటుంబ తగాదా అని తెలిపారు. పాపను ఏమైనా చేస్తారేమోనని భయపడ్డామని, శ్రేయను చూడగానే ప్రాణం లేచి వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
క్రిమినల్ సునీల్ దొరికాడు..
అనంతపురం, కృష్ణా జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్ అనంతపురం క్రైం : పోలీసుల కళ్లుగప్పి పరారైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ ఎట్టకేలకు కృష్ణా జిల్లాలో పట్టుబడ్డాడు. ఇతను వైఎస్ఆర్, అనంతపురం జిల్లాల్లో పలు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడు. బలవంతపు వసూళ్ల గ్యాంగ్ లీడరైన ఇతని స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు. ఇంజినీరింగ్ విద్యార్థులను చేరదీసి భారీగా డబ్బు ఆశ చూపి అనుచరులుగా మార్చుకునే వాడు. సుమారు 170 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఇతని అనుచరులుగా ఉన్నారు. డబ్బున్న వారిని కిడ్నాప్ చేసి సొమ్ము రాబట్టడం ఇతని ప్రధాన వ్యాపకం. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సునీల్‌ను గతంలో అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కడప సబ్‌జైలులో రిమాండ్‌లో ఉంటున్నాడు. ఓ కేసు విషయమై సునీల్‌ను ఈనెల 11న అనంతపురం ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇంతియాజ్ అహమ్మద్, వెంకటరమణారెడ్డి అనంతపురం కోర్టుకు తీసుకొచ్చారు. తిరిగి కడప జైలుకు తీసుకెళ్తుండగా పరారయ్యూడు. ఇంతటి కీలకమైన నిందితుడి విషయంలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. తప్పించుకున్నాడా.. లేక సెక్యూరిటీ సిబ్బందే తప్పించారా.. అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సునీల్ పారిపోవడంతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో ముమ్మర వేట ప్రారంభించారు. సునీల్ కదలికలు కృష్ణా జిల్లాలో ఉన్నట్లు సమాచారం రావడంతో అనంతపురం ఎస్పీ రాజశేఖర్‌బాబు, కృష్ణా ఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంయుక్తంగా సుమారు 20 బృందాలను నియమించి జల్లెడ పట్టించారు. కృష్ణా జిల్లాలో సోమవారం పట్టుబడగా రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. తప్పించుకున్నప్పటి నుంచి ఎక్కడెక్కడ తిరిగాడు.. మరేదైన ఘటనకు పాల్పడ్డాడా.. అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఇదీ అతగాడి నేర చరిత్ర మండ్ల సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ నేర చరిత్ర తలుచుకుంటేనే భయం వేస్తుంది. పాశ్చాత్య దేశాల అలవాట్లను రోజురోజుకు వంటబట్టించుకుంటున్న చాలా మంది విద్యార్థులు ఆశించిన స్థాయిలోడబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సునీల్ సరిగ్గా ఇలాంటి వారిని గుర్తించి వల వేశాడు. తనతో పాటు నేరాల్లో పాలుపంచుకునేలా చేశాడు. జల్సాలకు అలవాటు పడ్డ విద్యార్థులు తమ జీవితాలు నాశనమవుతున్నాయని, తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశల సౌధాన్ని కుప్పకూల్చుతున్నామనే కనీస ఆలోచన లేకుండా సునీల్ వలలో పడ్డారు. చివరకు ఊచలు లెక్కపెడుతున్నారు. భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు సునీల్ ముఠాలో సభ్యులుగా ఉండడం కలవర పెడుతున్న అంశం. ఈ గ్యాంగ్ డబ్బు కోసం పలు కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లు, ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడింది. సునీల్ తండ్రి మండ్ల వెంకటరమణ 2011కు ముందు పులివెందులలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. డిగ్రీ వరకు చదువుకున్న సునీల్ తండ్రి వ్యాపార కార్యకలాపాలకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. అనతి కాలంలోనే బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరప్రవృత్తికి తెర తీశాడు. ఎర్రచందనం అక్రమ రవాణాతో మొదలై... కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో 2011లో ఎర్రచందనం అక్రమ రవాణాతో ఇతని నేరచరిత్ర ప్రారంభమైంది. తర్వాత కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లకు ఒడిగట్టాడు. 2013లో తాడిపత్రి పట్టణానికి చెందిన మెడికల్ షాపు యజమానిని తన ముఠాతో కలిసి కిడ్నాప్ చేశాడు. డబ్బు ఇవ్వలేదనే కారణంతో అతడిని కర్నూలు జిల్లా జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఒక హత్యాయత్నం, ఐదు కిడ్నాప్ కేసులు, రాజంపేటలో ఒక కిడ్నాప్ కేసు, సింహాద్రిపురంలో ఆయుధాలు కల్గి ఉన్న కేసు, మైదుకూరులో బెదిరింపులు, బలవంతపు వసూళ్లు కేసు, అనంతపురం జిల్లా కదిరి, నార్పల పోలీస్స్టేషన్లలో రెండు కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. సునీల్‌తో పాటు మరో నలుగురు సభ్యులను ఈ ఏడాది ఆగస్టు 11న అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతటి నేర చరిత్ర ఉన్న అతడిపై పీడీ యాక్టు నమోదుకు పోలీసులు జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. కాగా, ఇతడి అనుచర గణం కదలికలపై కూడా తాజాగా పోలీసులు దృష్టి సారించారు. -
బెడిసికొట్టిన కిడ్నాప్ వ్యూహం
బెంగళూరు : వ్యూహం ఫలించక కిడ్నాపర్లు పోలీసు కాల్పుల్లో గాయపడి ఇక్కడి కేసీ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి కేసీ జనరల్ ఆస్పత్రికి చేరుకుని కిడ్నా పర్లు ధర్మారాం (22), జితేంద్ర (24) పరిస్థితిపై (వీరు రాజస్తాన్‌కు చెందినవారు) ఆరా తీశారు. వివరాలు... కాటన్‌పేట సమీపంలోని సుబ్రమణ్య కాలనీలో నివాసముంటున్న ఆమన్రాం ఇక్కడి చిక్కపేటలో దుస్తు ల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతని కుమారుడు వికాస్ (6). బుధవారం మధ్యాహ్నం వికాస్ స్కూల్ వ్యాన్‌లో ఇంటికి బయలుదేరిన సమయంలో ఆ వాహనం అనుసరిస్తూ ధర్మారాం, జితేంద్ర వచ్చారు. వికాస్ ఇంటి సమీపంలో వాహనం దిగిన వెంటనే నిందితులు బాలుడిని బైక్‌లో కిడ్నాప్ చేశారు. కొంత సమయం అనంతరం కిడ్నాపర్లు బాలుడు తండ్రి ఆమన్రాంకు ఫోన్ చేసి రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు. లేదంటే కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆమన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐలు సత్యనారాయణ, సునీల్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆమన్‌కు వస్తున్న ఫోన్లను ట్రాప్ చేసింది. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి కిడ్నాపర్లు చెప్పిన విధంగా ఆమన్ నగదుతో హరిశ్చంద్ర ఘాట్‌కు చేరుకున్నాడు. నగదు అక్కడి ఫుట్‌పాత్‌పై పెట్టాలని సూచించారు. నగదు బ్యాగ్ పెట్టిన ఒక్క నిముషానికే కిడ్నాపర్లు బ్యాగ్ తీసుకోడానికి వచ్చారు. అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు కిడ్నాపర్లను పట్టుకోడానికి యత్నించారు. నిందితులు మారణాయుధాలతో పోలీసులపై దాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన సీఐలు సత్యనారాయణ, సునీల్ కుమార్ తుపాకి కాల్పు లు జరిపారు. రెండు బుల్లెట్లు ధర్మరాం, జితేంద్ర కాళ్లలోకి దూసుకెళ్లడం తో వారు అక్కడే కుప్పకూలిపోయారు. ఈ మేరకు పోలీసులను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి అభినందించారు. -
పోలీసుల అదుపులో కిడ్నాపర్లు
డోన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఓ యువకున్ని ఎత్తుకెళ్లి రూ. 15 లక్షలు డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతున్న ఓ ముఠాను శుక్రవారం డోన్ పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి ఆ యువకునికి విముక్తి కల్పించి తండ్రికి అప్పగించారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని దొరపల్లెకు చెందిన ఎల్లప్ప కుమారుడు మధు హైదరాబాద్‌లో చిరువ్యాపారం చేసుకుంటూ గత నెల 20వతేదీన కిడ్నాప్‌కు గురయ్యాడు. అదే సమయంలో అతని వెంట ఉన్న మరో బాలుడు జంగాల నాగరాజు తప్పించుకున్నాడు. మధును ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు రూ. 15లక్షలు ఇస్తే వదిలిపెడతామని ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో తండ్రి ఎల్లప్ప, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు డబ్బులు డిమాండ్ చేసేందుకు కిడ్నాపర్లు వాడిన సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసును చేధించారు. డోన్‌కు చెందిన జంగాల ఇప్పి నాగశెట్టి, జంగాల ఈర్లపల్లి చంద్రయ్య, దేవనకొండ మండలం పి.కోటకొండకు చెందిన బోయ పంపన్న, బోయ గడివేముల వెంకటేష్, బోయ కోలంట్ల రామాంజనేయులు, బోయ గిడ్డయ్య, కమ్మరికౌలుట్లయ్య దొరపల్లె క్రాస్‌రోడ్డు వద్ద 44వ నెంబర్జాతీయ రహదారిపై సఫారీ వాహనంలో సంచరిస్తుండగా అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న సీఐ డేగలప్రభాకర్, ఎస్ఐలు మోహన్‌రెడ్డి, సతీష్, సిబ్బందిని అభినందించారు.