
ఎట్టకేలకు.. తల్లి ఒడిలోకి
సంచలనం సృష్టించిన పసి బాలుడు కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది.
- బాలుడిని రూ. 5 లక్షలకు అమ్మిన కిడ్నాపర్లు
- 20 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు
కరీంనగర్ రూరల్/క్రైం: సంచలనం సృష్టించిన పసి బాలుడు కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. కరీంనగర్ మండలం చామన్‌పల్లికి చెందిన వడ్లకొండ్ల రమ్య, ప్రవీణ్ దంపతుల బాబుని మంగళవారం ఓ మహిళ, యువకుడు కలసి చల్మెడ ఆనందరావు ఆస్పత్రి నుంచి కిడ్నాప్ చేయడం తెలిసిందే. తీగల గుట్టపల్లి లో మంగళవారం అర్ధరాత్రి దాటాక బాలుడి ఆచూ కీని కనిపెట్టిన పోలీసులు.. తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. బాలుడిని 20గంటల తర్వాత అప్పగించడంతో రమ్య, ప్రవీణ్ ఆనందంలో మునిగిపోయారు. బాలుడు క్షేమంగా దొరకడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఐసీయూలో చికిత్స: కిడ్నాప్‌కు గురైన బాలుడు డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురి కాగా ఐసీయూలో చికిత్స అందిస్తున్నా రు. బాలుడికి పాలు పట్టించకపోవడం తోపాటు ఎండ తీవ్ర తకు చర్మం వడలి పోయింది. బాలుడిని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని మహిళ మరో వ్యక్తితో కలిసి చొప్పదండిలోని ఓ కుటుంబానికి రూ. 5 లక్షలకు విక్రయించినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌ని ఛేదించేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో యత్నిస్తుండడంతో బాలు డిని కొన్న వ్యక్తులు ఆందోళనకు గురై ఓ మధ్యవర్తి ద్వారా బాలుడిని పోలీసులకు అప్పగించి నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ వాసీం ద్వారా బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.