హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని టీ-బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం రాజ్భవన్లో తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిశారు. కరవుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గవర్నర్కు నివేదికను అందజేశారు.