సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి (జూన్) స్కూళ్ల నుంచి మొదలుకొని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు అన్నింటిలో వసతులు కల్పించడంతోపాటు నియామకాలను పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలసి విద్యా కార్యక్రమాలను వివరించారు.
రూ. 1,500 కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామన్నారు. యూనివర్సిటీల్లో వైస్‌చాన్స్‌లర్ల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, ఈ నెలాఖరు కల్లా నియామకాలు పూర్తవుతాయన్నారు. పాఠశాలల్లో సరిపడ ఉపాధ్యాయులను నియమించేందుకు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీకి చర్యలు చేపడుతున్నామన్నారు. జూనియర్ డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌కు చర్యలు చేపడుతున్నామన్నారు. సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని గవర్నర్‌కు నివేదించారు.
జూన్ నాటికి విద్యా సంస్థల్లో నియామకాలు
Published Fri, Jan 8 2016 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement