తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ | Telangana Governor Narasimhan | Sakshi
Sakshi News home page

తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్

Published Thu, May 29 2014 2:13 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ - Sakshi

తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్

ఆంధ్రప్రదేశ్‌తో పాటు అదనపు బాధ్యతలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యత లు నిర్వహిస్తున్న ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు కొత్తగా ఏర్పడబోతున్న తె లంగాణ రాష్ర్ట బాధ్యతలను కూడా అప్పగించారు. తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్‌కు అదనపు బాధ్యతలు కట్టబెడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

జూన్ 2న తెలంగాణ రాష్ర్టం ఏర్పాటవుతున్న నేపథ్యంలో తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నియమించే వరకు నరసింహన్ అదనపు బాధ్యతలు నిర్విహ స్తారంటూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్2 తర్వాతే తెలంగాణ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపడతారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement