
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని పొగిడిన గవర్నర్ నరసింహన్, తాను ఉంటున్న రాజ్‌భవన్ పేరును టీఆర్‌ఎస్ కార్యాలయంగా మారుస్తారా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి గాంధీభవన్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
రాజ్యాం గ పరిరక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ హోదాను కించపరిచే విధంగా వ్యవహరించి ఒక పార్టీపై పొగడ్తలు కురిపించడం ద్వారా రాజ్యాంగాన్ని మలినం చేశారని ఆరోపించారు. బి.ఆర్.అంబేడ్కర్ పేరుతో నాటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు పేరు మార్చిన విష యం గవర్నర్‌కు కనిపించలేదా అని భట్టి ప్రశ్నించారు. మొత్తం 38వేల కోట్లతో రూపకల్పన చేసిన ప్రాజెక్టుకు అప్పటికే 10వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
కేవలం 28వేల కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి 80 వేల కోట్ల వ్యయానికి పెంచారన్నారు. 50 వేల కోట్లు ఎవరికి పోతున్నాయో గవర్నర్‌కు అర్థం కాలేదా అని భట్టి ప్రశ్నించారు. డీపీఆర్ గురించి మాట్లాడకుండా, వ్యయం పెంపును ప్రశ్నించాల్సిన బాధ్యతలను గవర్నర్ విస్మరించడమే కాకుండా సీఎం కేసీఆర్‌ను, హరీశ్‌ను పొగడటంలో రహస్యం ఏమిటని ప్రశ్నించారు.
పేరు మార్చి వ్యయం పెంచారు
ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ 1,500 కోట్లతో పూర్తయ్యేవని, వాటికి సీతారామ ప్రాజెక్టు అనే పేరు మార్చి 10వేల కోట్లకు వ్యయాన్ని పెంచా రని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడే గవర్నర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని భట్టి ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచడంద్వారా ప్రజలపై లక్షకోట్ల అదనపు భారం పడుతుందని, ఈ పెరిగిన భారం ఎవరిపై పడుతుందో ప్రశ్నించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే గవర్నర్ పొగడటంతో అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. గవర్నర్ టీఆర్‌ఎస్ ఏజెంటుగా పనిచేస్తున్నాడన్నారు. ఈ ప్రాజెక్టుల అవినీతిలో గవర్నర్‌కు భాగస్వామ్యం ఉన్నట్టేనని వీహెచ్ ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రాజె క్టు వ్యయం, నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయం, ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వం తీరు గురించి గవర్నర్ ఎందు కు మాట్లాడలేదని ప్రశ్నించారు. భూసేకరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదో గవర్నర్ తెలుసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment