
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును గవర్నర్ నరసింహన్ ప్రశంసిస్తున్నారంటే ఆయన గవర్నరా? లేక టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడా? అనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పీఏసీ (రాజకీయ వ్యవహారాల మండలి) సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు.
గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగం అపహా స్యం అవుతున్నా గవర్నర్ పట్టించుకోకపోగా సీఎం చంద్రబాబు ప్రశంసించడం విస్మయం కలిగిస్తోందన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చాలా చేస్తున్నారు కనుక ఇక రాష్ట్ర ప్రజలే ప్రభుత్వానికి చేయాల్సి ఉందని గవర్నర్ చెబుతున్నారంటే ఆయన టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా కనిపిస్తున్నారన్నారు.