
హీరో శివాజీ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్ నరసింహన్ అని సినీ హీరో శివాజీ విమర్శించారు. గురువారం గుంటూరులో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో శివాజీ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అలాగే మనకంటే ముందు 25 మంది పార్లమెంటు సభ్యులు పోరాడాలని, ఎంపీలు తమ స్వార్థం కోసం నాటకాలాడుతున్నారని.. పార్లమెంటు జరగకుండా చేస్తే సగం విజయం సాధించినట్లేనని శివాజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెట్టి వెంక య్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారని, మన రాష్ట్రానికి సంబంధించి ఏమడిగినా వెంకయ్య నాయుడికి కోపం వస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక హోదా లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరని శివాజీ అన్నారు.