
నార్వేతో 13 ఒప్పందాలు
ఓస్లో: ద్వైపాక్షిక సంబంధాల పెంపునకు భారత్, నార్వేలు రక్షణ, విద్య తదితర రంగాల్లో 13 ఒప్పందాలపై మంగళవారం సంతకాలు చేశాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని భారత బృందం నార్వే పర్యటనలో వీటిని కుదుర్చుకున్నాయి. భారత్‌లో నూతన ప్రభుత్వం తలపెట్టిన మేకిన్ ఇండియా (భారత్‌లో తయారీ) కార్యక్రమంలో భాగం కావాలని నార్వే కంపెనీలను ఈ సందర్భంగా ప్రణబ్ ఆహ్వానించారు. రైల్వే, రహదారులు, పోర్టులు, విద్యుత్, కమ్యూనికేషన్ల రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పిలుపునిచ్చారు.