ఏప్రిల్ 1న ఉత్తరాఖండ్ కు ప్రణబ్ ముఖర్జీ! | President to visit Uttarakhand on April 1 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 1న ఉత్తరాఖండ్ కు ప్రణబ్ ముఖర్జీ!

Published Wed, Mar 16 2016 8:52 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

ఏప్రిల్ 1న ఉత్తరాఖండ్ కు ప్రణబ్ ముఖర్జీ!

ఏప్రిల్ 1న ఉత్తరాఖండ్ కు ప్రణబ్ ముఖర్జీ!

డెహ్రాడూన్ః రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తరాఖండ్ పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి.   ఏప్రిల్ 1న ఉత్తరాఖండ్ లోని స్వామీ రామ్ హిమాలయన్ విశ్వవిద్యాలయంలో జరుగబోయే స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు.

ఉత్తరాఖండ్ డోయ్వాలా కొండప్రాంతంలోని స్వామి రామ్ హిమాలయ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 1న స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోజు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య కార్యక్రమంలో పాల్గోనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఏప్రిల్ 1న రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన సన్నాహాలపై బుధవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో నిర్వహించిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో సమీక్షించారు.

ఛీఫ్ సెక్రెటరీ శత్రుఘ్న సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశాధ్యక్షుడి ఉత్తరాఖండ్ సందర్శనకు సంబంధించిన భద్రతా చర్యలపై కూడ సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement