న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆదేశానికి ఎల్లప్పుడూ మద్ధతుగా ఉంటామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. గురువారం కాబుల్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ ప్రణబ్ ఆదేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి సందేశాన్ని పంపారు.ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఉగ్రనిర్మూలనకు ఇండియా అఫ్ఘన్ తో భుజం భుజం కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉందని స్ఫష్టం చేశారు. నిన్న ఆదేశంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై జరిపిన ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.