‘సూపర్–8’లో భారత్ విజయారంభం
47 పరుగులతో అఫ్గానిస్తాన్ చిత్తు
మెరిసిన సూర్యకుమార్, హార్దిక్
రాణించిన బుమ్రా, అర్ష్దీప్
రేపు బంగ్లాదేశ్‌తో తర్వాతి పోరు
టి20 ప్రపంచ కప్ ‘సూపర్–8’ దశలో భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. అఫ్గానిస్తాన్ చక్కటి బౌలింగ్‌తో టీమిండియా ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనా ఆపై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించింది. ఈ ఫార్మాట్‌లో తన నంబర్‌వన్ హోదాకు న్యాయం చేస్తూ, తనేంటూ నిరూపిస్తూ సూర్యకుమార్ యాదవ్ జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు.
ఆ తర్వాత ఛేదనలో అఫ్గాన్ టీమ్ ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. టీమిండియా పదునైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను సమర్పించుకుంది. ఇక మరో ఆసియా జట్టు బంగ్లాదేశ్‌తో శనివారం భారత్ తర్వాతి సమరానికి సిద్ధమైంది.
బ్రిడ్జ్‌టౌన్: వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ చేరే దిశగా భారత జట్టు కీలక విజయాన్ని అందుకుంది. సూపర్–8 గ్రూప్–1లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రషీద్ ఖాన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. బుమ్రా (3/7), అర్‡్షదీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
కీలక భాగస్వామ్యం...
ఆరంభం నుంచే తడబడుతూ ఆడిన రోహిత్ శర్మ (13 బంతుల్లో 8; 1 ఫోర్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత రషీద్ రెండు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. నబీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో జోరు ప్రదర్శించిన రిషభ్ పంత్ (11 బంతుల్లో 20; 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోగా...రషీద్ తర్వాతి ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో విరాట్ కోహ్లి (24 బంతుల్లో 24; 1 సిక్స్) అవుటయ్యాడు.
ఈ దశలో సూర్యకుమార్ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరు వేగంగా సాగింది. రషీద్ ఓవర్లో సూర్య ఫోర్, సిక్స్ కొట్టగా... అదే ఓవర్లో మరో ఎండ్‌లో శివమ్ దూబే (7 బంతుల్లో 10; 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో సూర్యకు పాండ్యా జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో జట్టు మెరుగైన స్థితికి చేరింది. నూర్ ఓవర్లో పాండ్యా వరుసగా 4, 6 కొట్టగా... ఫజల్ ఓవర్లో సూర్య వరుసగా 6, 4 బాది 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే తర్వాతి బంతికే అతను అవుట్ కాగా, మరుసటి ఓవర్లో పాండ్యా ఆట ముగిసింది. జడేజా (5 బంతుల్లో 7; 1 ఫోర్) ప్రభావం చూపలేకపోగా, ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ (6 బంతుల్లో 12; 2 ఫోర్లు) కీలక పరుగులు రాబట్టాడు. తొలి 10 ఓవర్లలో జట్టు 79 పరుగులు చేయగా, తర్వాతి 10 ఓవర్లలో 101 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. మరోవైపు గురువారం మరణించిన భారత మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్‌కు నివాళిగా మన ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్‌లు ధరించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బుమ్రా తొలి ఓవర్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి గుర్బాజ్ (11; 1 ఫోర్, 1 సిక్స్) అవుట్ కావడంతో మొదలైన జట్టు పతనం వేగంగా సాగింది. ఎవరు కూడా భారత బౌలింగ్ ముందు పట్టుదలగా నిలవలేకపోయారు. చెప్పుకోదగ్గ బౌలింగ్ వనరులు ఉన్నా ...ఎప్పటిలాగే బ్యాటర్ల వైఫల్యం దెబ్బ తీసింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ఫజల్ 8; కోహ్లి (సి) నబీ (బి) రషీద్ 24; పంత్ (ఎల్బీ) (బి) రషీద్ 20; సూర్యకుమార్ (సి) నబీ (బి) ఫజల్ 53; దూబే (ఎల్బీ) (బి) రషీద్ 10; పాండ్యా (సి) అజ్మతుల్లా (బి) నవీన్ 32; జడేజా (సి) గుల్బదిన్ (బి) ఫజల్ 7; అక్షర్ (రనౌట్) 12; అర్‡్షదీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–11, 2–54, 3–62, 4–90, 5–150, 6–159, 7–165, 8–181. బౌలింగ్: ఫజల్ హక్ 4–0–33–3, నబీ 3–0–24–0, నవీన్ ఉల్ హక్ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–26–3, నూర్ అహ్మద్ 3–0–30–0, అజ్మతుల్లా 2–0–23–0.
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) పంత్ (బి) బుమ్రా 11; హజ్రతుల్లా (సి) జడేజా (బి) బుమ్రా 2; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 8; గుల్బదిన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 17; అజ్మతుల్లా (సి) అక్షర్ (బి) జడేజా 26; నజీబుల్లా (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 19; నబీ (సి) జడేజా (బి) కుల్దీప్ 14; రషీద్ (సి) జడేజా (బి) అర్ష్ దీప్ 2; నూర్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 12; నవీన్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 0; ఫజల్‌హక్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–23, 4–67, 5–71, 6–102, 7–114, 8–121, 9–121, 10–134. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–36–3, బుమ్రా 4–1–7–3, అక్షర్ పటేల్ 3–1–15–1, హార్దిక్ పాండ్యా 2–0–13–0, కుల్దీప్ 4–0–32–2, జడేజా 3–0–20–1.
టి20 ప్రపంచకప్‌లో నేడు
ఆ్రస్టేలియా X బంగ్లాదేశ్
వేదిక: నార్త్‌సౌండ్; ఉదయం గం. 6 నుంచి
ఇంగ్లండ్ X దక్షిణాఫ్రికా
వేదిక: గ్రాస్‌ఐలెట్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment