Bollaram
-
రెప్పపాటులోనే మృత్యు ఒడికి
హైదరాబాద్: చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన దంపతులపై అకస్మాత్తుగా చెట్టు కూలి మీద పడడంతో భర్త దుర్మరణం పాలయ్యాడు. భార్య తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. ఈ విషాదకర సంఘటన బొల్లారం పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..తూంకుంటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి రవీందర్..బొల్లారం పయనీర్ బజార్ ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భార్య సరళకుమారితో కలిసి హోండా యాక్టివాపై బొల్లారం ఆస్పత్రికి వచ్చారు. వాహనం ఆవరణలోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కూలి వీరిపై పడింది. ఈ ఘటనలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా సరళకుమారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం సరళాదేవిని గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న సహచర ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. సరళకుమారి అనారోగ్యం బారిన పడడంతో చికిత్స కోసం బొల్లారం ఆసుపత్రికి వచ్చారని వారు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఎండిన భారీ వృక్షాన్ని తొలగించినట్లయితే ప్రమాదం జరిగేది కాదని, పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్.. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు.. చెట్టు కూలి భర్త మృతి https://t.co/kUxuCIxNku pic.twitter.com/SGDpJqzx1l— Telugu Scribe (@TeluguScribe) May 21, 2024 -
డ్రగ్స్ ముఠాపై నార్కోటిక్ ఉక్కుపాదం
-
హైదరాబాద్ శివారులో రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఐడీఏ బొల్లారంలో భారీగా దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే మాదక ద్రవ్యాలను శుక్రవారం డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ పోల్ సహకారంతో బొల్లారంలో డ్రగ్స్ రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. స్థానికంగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పీఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధికారులు సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించి.. రూ. 9 కోట్ల విలువైన 90 కిలోల మేపిడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత పదేళ్లుగా ఈ డ్రగ్స్‌ను తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. విదేశాలకు తరలిస్తున్న కస్తూరిరెడ్డిని అరెస్ట్ చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో వాటిని పెట్టి బయటకు తరలిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోనూ నిషేధిత డ్రగ్స్ అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: దానం నాగేందర్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు -
హైదరాబాద్ బొల్లారంలో మరో హిట్ అండ్ రన్ కేసు
-
HYD: తోపుడుబండిపైకి దూసుకెళ్లిన కారు.. పరారీలో డాక్టర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బొల్లారంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. గురువారం తెల్లవారుజామున బొల్లారం పరిధిలో వేగంగా కారు నడుపుతూ ఓ వైద్యుడు.. ఫుట్‌పాత్ వెంట ఉన్న తోపుడుబండిపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న పలువురు వ్యక్తులు వెంటాడి కారును అడ్డగించి డాక్టర్ కార్తీక్‌ను పట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన డాక్టర్.. హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా సమాచారం. ఈ ఘటనలో సయ్యద్ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, తాను పని చేస్తున్న ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తానని చెప్పిన డాక్టర్.. బాధితుడిని తన కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, ఆ వైద్యుడు పరారయ్యాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: షణ్ముక్ గంజాయి కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు! -
HYD: మద్యం మత్తులో సీఐ కారు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నడుపరాదని చెబుతూనే కొందరు పోలీసులు మాత్రం తప్పతాగి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ సీఐ ఫుల్లుగా మద్యం సేవించి హైస్పీడ్‌లో కారు నడిపి.. ఎదురుగా వస్తున్న వాహనాలన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో సీఐ శ్రీనివాస్ ఫుల్లుగా మద్యం సేవించి కారును నడిపారు. ఈ క్రమంలో ఎదురుగా కూరగాయల లోడుతో వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో, వాహనం నడుపుతున్న శ్రీధర్.. వాహనం ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో శ్రీధర్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. కాగా, సీఐ శ్రీనివాస్ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. సీఐ శ్రీనివాస్ వాహనంపై ఇప్పటికే ఆరు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నాయి. ఇక, సీఐ శ్రీనివాస్ మద్యం సేవించి కారు నడుపారన్న నేపథ్యంలో డ్రంకన్ అండ్ డ్రైవ్ టెస్టులో రీడింగ్ 200 దాటినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదం... తెలుగు కుటుంబం దుర్మరణం -
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న రాష్ట్రపతి నిలయం
-
హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. వారం రోజుల పాటు ఇక్కడే బస
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ముస్తాబవుతోంది. ఈ నెల 26న శీతాకాల విడిది కోసం నగరానికి వస్తున్న రాష్ట్రపతి వారం రోజుల పాటు ఇక్కడ బస చేస్తారు. దీంతో బొల్లారంలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఆర్మీ, పోలీసు, రెవెన్యూ, కంటోన్మెంట్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సహా తదితర విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దక్షిణాది విడిది... ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు సిమ్లా, హైదరాబాద్‌లోనూ రాష్ట్రపతి అధికారిక నివాసాలున్నాయి. శీతాకాలంలో కనీసం వారం రోజుల పాటు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడంతో పాటు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించడం ఆనవాయితీ. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌తో పాటు దాదాపు అందరు రాష్ట్రపతులూ ఇక్కడ బస చేశారు. కోవిడ్ ఇతర కారణాల రీత్యా మూడేళ్ల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ నివాసానికి రాలేదు. చివరిసారిగా 2019 డిసెంబర్లో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. రెండేళ్ల విరామానంతరం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. 1860లో రెసిడెన్సీ హౌస్ పేరిట నిర్మాణం.. ►1860లో నాటి నిజాం నాజిర్ ఉద్దౌలా హయాంలో రెసిడెన్సీ హౌస్ పేరిట బొల్లారంలో భవనాన్ని నిర్మించారు. బ్రిటిష్ రెసిడెంట్ కంట్రీ హౌస్‌గా దీన్ని వినియోగించుకున్నారు. 1948లో ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ భారత్‌లో విలీనమైంది. అనంతరం రెసిడెన్సీ హౌస్ రాష్ట్రపతి దక్షిణాది విడిదిగా కొనసాగుతోంది. ►90 ఎకరాల విస్తీర్ణంలో 16 గదులతో కూడిన భవనంతో పాటు పక్కనే సందర్శకులు, సిబ్బంది క్వార్టర్లు ఉన్నాయి. 150 మంది విడిది చేసేందుకు అనువైన ఈ భవనంలో దర్బార్, డైనింగ్, సినిమా హాళ్లు, ప్రధాన భవనానికి సొరంగ మార్గం ద్వారా అనుసంధానం చేసిన కిచెన్ హాల్ ఉన్నాయి. పూలు, పండ్ల తోటలు ►బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వివిధ రకాల పూల మొక్కలతో పాటు మామిడి, దానిమ్మ, సపోటా, ఉసిరి, కొబ్బరి తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, మంచినీటి బావులతో పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఉంటుంది. 116 రకాల ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలతో కూడిన గార్డెన్ ప్రత్యేక ఆకర్షణ. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చొరవతో ఏర్పాటు చేసిన నక్షత్రశాలను 2015లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రారంభించారు. 27 నక్షత్రాలను ప్రతిబింబించేలా 27 రకాల విభిన్నమైన మొక్కలతో దీన్ని రూపొందించారు. చిట్టడవిని తలపించేలా.. ►నగరం నడిబొడ్డును చుట్టూ మిలిటరీ స్థావరాలు, బలగాల పహారాలో ఉండే రాష్ట్రపతి నిలయం ఓ చిట్టడవిని తలపిస్తుంది. పూలు, పండ్ల తోటల్లో పక్షుల కిలకిలారావాలతో పాటు మయూరాలు కూడా కనువిందు చేస్తాయి. వేకువజామున రాష్ట్రపతి వాకింగ్ చేసేందుకు అనువుగా వాకింగ్ ట్రాక్‌ను సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం ఆవరణలో కోతులతో పాటు పాముల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతియేటా రాష్ట్రపతి పర్యటనకు కొన్ని రోజుల ముందు నుంచే నెహ్రూ జూలాజికల్ పార్కు సిబ్బంది ఇక్కడికి చేరుకుని వాటిని నియంత్రించే పనిలో నిమగ్నమవుతారు. రాష్ట్రపతి పర్యటన ముగిశాక జనవరిలో సామాన్యుల సందర్శనకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో రిహార్సల్స్ హిమాయత్‌నగర్: ఈ నెల 27న నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కాలేజీలో రిహార్సల్స్ చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి నారాయణగూడకు చేరుకున్న ప్రత్యేక బృందాలు పరిసర ప్రాంతాలను తమ అ«దీనంలోకి తీసుకున్నారు. కాలేజీలోని ప్రతీ అణువును జాగిలాలతో తనిఖీలు చేయించారు. కాలేజీ ఆడిటోరియంలో జరిగే సదస్సులో రాష్ట్రపతి హాజరు కానున్న నేపథ్యంలో ఆయా ఏర్పాట్లను ప్రత్యేక బృందాలు పరిశీలించాయి. -
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం
70 ఏళ్లపాటు బ్రిటన్ను ఏలిన రాణి ఎలిజబెత్–2కు హైదరాబాద్ మహానగరంతో అనుబంధం ఉంది. చారిత్రక భాగ్యనగరాన్ని ఆమె ఒకసారి సందర్శించి ముగ్ధులయ్యారు. వందల ఏళ్ల నాటి చారి్మనార్, గోల్కొండ కట్టడాలు ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి. ఎలిజబెత్–2 తన పాలనా కాలంలో మూడుసార్లు భారత్‌కు వచ్చారు. అందులో భాగంగా 1983 నవంబర్ 20న ఆమె హైదరాబాద్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చికి వెళ్లారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఆమె నానమ్మకు నానమ్మ అయిన విక్టోరియా మహారాణి తన సొంత డబ్బుతో ఈ చర్చిని కట్టించారు. అందుకే ఎలిజబెత్–2 ప్రత్యేకంగా ట్రినిటీకి విచ్చేశారు. ట్రినిటీ చర్చిని క్వీన్స్ చర్చి అని కూడా పిలుస్తుంటారు. ఆ సందర్భంగానే ఆమె రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్, గోల్కొండ కుతుబ్‌షాహీ టూంబ్స్, చార్మినార్, తదితర ప్రాంతాలను సందర్శించారు. ఎలిజబెత్–2తోపాటు ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ కూడా ఆమె వెంట ఉన్నారు. అప్పుడు ఆర్కియాలజిస్ట్‌గా విధులు నిర్వహించిన ఎంఎ ఖయ్యూం వారి వెంట ఉండి నగరంలోని చారిత్రక ప్రదేశాలను పరిచయం చేశారు. చదవండి: ఎలిజబెత్-2 వివాహానికి ఖరీదైన డైమండ్ నెక్లెస్‌ను గిఫ్గ్‌గా ఇచ్చిన నిజాం నవాబు -
పేదలకు అత్యాధునిక వైద్యం: మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్/రసూల్‌పురా: ఎయిమ్స్ తరహాలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)పేరిట నగరం నలుదిక్కులా ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఆసుపత్రుల్లో మూడింటికి సీఎం కేసీఆర్ మంగళవారం భూమి పూజ చేయనున్నారు. బొల్లారం, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లలో రూ.2,679 కోట్ల వ్యయంతో ప్రభుత్వం వీటిని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బొల్లారంలో ఆసుపత్రి నిర్మించనున్న స్థలంతోపాటు, సభాస్థలి ఏర్పాట్లను ఆదివారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పరిశీలించారు. పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు చేపడుతున్న మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని హరీశ్‌రావు చెప్పారు. వీటితో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య కూడా మరింత బలోపేతమవుతుందన్నారు. రూ.897 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బొల్లారం ఆసుపత్రితో మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, కంటోన్మెంట్ ప్రజలకు సకాలంలో అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయన్నారు. -
హైదరాబాద్: బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం
-
బొల్లారంలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం మాడ్యూల్ ఇండస్ట్రీస్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. -
బొల్లారంలో దారుణ హత్య
-
బొల్లారం అగ్ని ప్రమాదం: అదుపులోకి మంటలు
సాక్షి, హైదరాబాద్: వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. సంఘటన స్థలం నుండి వెళ్లిపోయిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లిపోగా, పరిశ్రమలో రెండు ఫైర్ బృందాలను అందుబాటులో ఉంచారు. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మొత్తం 3 బ్లాకులు కాగా, మొదటి బ్లాక్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఒక్కసారిగా రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ కావడంతో భవనం మొత్తం నేలమట్టం అయ్యింది. (చదవండి: ఐడీఏ బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం) ప్రొడక్షన్ యూనిట్లో ఉన్నవారికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 8 మంది గాయపడగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మొత్తం 50 కి పైగా రీయాక్టర్లు ఉన్నాయి. ఈ పరిశ్రమలో వివిధ ప్రముఖ కంపెనీల రా మెటీరియల్ తీసుకొని బల్క్ డ్రగ్స్ తయారు చేస్తారు. ప్రమాదంపై పోలీసులు, రెవెన్యూ, కెమికల్ ఇండ్రస్టీస్ ఇన్స్పెక్షన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇక హైదరాబాద్‌లో ఫ్రీ వాటర్.. అయితే..) -
విడిది.. విశిష్ట అతిథి
సాక్షి, హైదరాబాద్: ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో దక్షిణాది విడిది అయిన బొల్లారంలోని ఆర్పీ భవనాన్ని నాలుగుసార్లు సందర్శించారు. 2012లో రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది డిసెంబర్ నెలాఖరులో హైదరాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌కు శీతాకాల విడిదికి వచ్చారు. 2013 నూతన సంవత్సర వేడుకలను ఆయన ఇక్కడే జరుపుకొన్నారు. తిరిగి 2013 డిసెంబర్‌లోనూ ఇక్కడకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో మాత్రం ఆయన శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాలేదు. మరుసటి ఏడాది డిసెంబర్‌కు బదులు జూలైలోనే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. ఆ ఏడాది కేవలం మూడు రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. చివరిసారిగా 2016 డిసెంబర్లో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. నక్షత్రవాటిక, దానిమ్మ తోటల ఏర్పాటు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్‌లోని నక్షత్ర వాటిక మాదిరిగానే, బొల్లారం రాష్ట్రపతి నిలయంలోనూ నక్షత్ర వాటిక ఏర్పాటు చేయించారు. ఇందులో 27 నక్షత్రాలు (రాశులు) ప్రతిబింబించేలా 27 రకాల మొక్కలు ఏర్పాటు చేశారు. 99 ఎకరాల సువిశాల రాష్ట్రపతి నిలయంలో సగానికిపైగా స్థలం వృథాగానే ఉండేది. ఈ నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చిన ఆయన ఖాళీ స్థలాల్లో పండ్ల తోటలు, పూలమొక్కలు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. దీంతో అప్పటికే ఉన్న మామిడి, ఉసిరి, సపోటా తోటలకు అదనంగా దానిమ్మ తోటను ఏర్పాటు చేశారు. నేనున్నానంటూ భరోసానిచ్చారు: పీవీ వాణిదేవి సాక్షి, సిటీబ్యూరో: ‘నాన్న పీవీతో ప్రణబ్ ముఖర్జీది సుదీర్ఘ బంధం. నాన్న మరణం తర్వాత ఆయన మా కుటుంబానికి నేనున్నానన్న భరోసానిచ్చారు. కొన్ని సందర్భాల్లో పార్టీ పట్టించుకోకున్నా.. ఆయన మా కుటుంబానికి అండగా నిలిచారు. ప్రణబ్ మరణం దేశానికి తీరనిలోటు’ అని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు పీవీ వాణీదేవి అన్నారు. ప్రణబ్ మరణంపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 2012 డిసెంబరులో తొలిసారిగా పీవీ నర్సింహారావు స్మారక ఉపన్యాసాన్ని ప్రణబ్ ముఖర్జీయే ఇచ్చారని, ఆ రోజు తమ కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఫొటోలు తీయించారని వాణీదేవి గతాన్ని జ్ఞాపకం చేశారు. ప్రణబ్‌కు సీజీఆర్, గ్రేస్ నివాళి లక్డీకాపూల్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్), తూర్పు కనుమల పరిరక్షణ వేదిక (గ్రేస్) ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఆయన మరణంతో దేశం పర్యావరణం పట్ల ఎంతో జ్ఞానం, స్పృహ కలిగిన ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని అభిప్రాయపడింది. అర్ధ శతాబ్దానానికిపైగా వివిధ రూపాల్లో, హోదాల్లో ఆయన దేశానికి అందించిన సేవలు అనితర సాధ్యం, చిరస్మరణీయం అని పేర్కొంది. ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి, లీలా లక్ష్మారెడ్డి (సీజీఆర్), దిలీప్‌రెడ్డి (గ్రేస్) ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించారు. -
రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన కార్లు
-
బొల్లారంలో కొత్త అందాలు
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం కొత్త సోయగాలు నింపుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని పూదోటలకు దీటుగా పూర్తి పచ్చదనాన్ని సంతరించుకుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ మంచి ఫలితాలనిచ్చింది. కాండం లేకుండా ఆకులతోనే ఉండే పామ్ జాతికి చెందిన 30 రకాల మొక్కలతో పామేటమ్ ఏర్పాటు, నీటి అవసరం అంతగా లేని మొక్కల జాతులతో రాక్ గార్డెన్ అభివృద్ధి, ప్రస్తుతమున్న రాళ్ల మధ్యనే అందంగా తీర్చిదిద్దిన జలపాతాన్ని అటవీ శాఖ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. సోమవారం ఈ రాక్ గార్డెన్, పామేరియం, జలపాతాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి దంపతులు కొన్ని మొక్కలు కూడా నాటారు. 170 జాతుల మొక్కలు.. ఆగస్టు నుంచి నాలుగున్నర నెలల కాలంలో 20 రకాల థీమ్స్‌తో అటవీ శాఖ వివిధ రకాల మొక్కలు నాటింది. దాదాపు 75 ఎకరాల్లో మొత్తం 170 జాతులకు చెందిన 13,714 కొత్త మొక్కలు నాటింది. శీతాకాల విడిదిలో భాగంగా రోజువారీ మార్నింగ్ వాక్‌లో కొత్తగా నాటిన మొక్కలను, పచ్చదనం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను అటవీ అధికారులతో కలిసి రాష్ట్రపతి పరిశీలించారు. ఈ మొక్కలు నాటక ముందు ఎలా ఉంది, కొత్త మొక్కలు నాటిన తర్వాత అక్కడి పచ్చదనం ఎలా ఉందనే ఆల్బమ్‌ను కూడా అటవీ శాఖ రాష్ట్రపతికి సమర్పించింది. అటవీ శాఖ పనితీరును స్వయంగా చూసిన రాష్ట్రపతి అధికారులను మెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారాన్ని కొనసాగించి పర్యావరణపరంగా మంచి ఫలితాలు సాధించాలని, కొత్తగా ఎలాంటి పచ్చదనం చర్యలున్నా ఆహ్వానిస్తామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా, రఘువీర్, అదనపు అటవీ సంరక్షణాధికారులు శోభ, డోబ్రియల్ పాల్గొన్నారు. మూడేళ్లకు రూ. 1.7 కోట్లు.. క్రితంసారి హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు హరితహారంలో పాల్గొన్న రాష్ట్రపతి, బొల్లారంలో ఉన్న 75 ఎకరాల్లో కూడా విరివిగా పచ్చదనం పెంచాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. ఇందుకోసం ఉన్న చెట్లను తొలగించకుండా, జీవ వైవిధ్యం విలువ పెంచేలా కొత్తగా అభివృద్ధి చేయటం, మొక్కలు లేని ప్రాంతాల్లో పెద్దవి నాటడం, సందర్శనకు వచ్చే పిల్లలు, పెద్దలకు మొక్కలపై అవగాహన పెరిగేలా బొల్లారం నిలయం ఉండాలని ఐదు సూత్రాలను ప్రతిపాదించారు. ఆ తర్వాత అటవీ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిన ఆయన మూడేళ్లకు కలిపి రూ. 1.7 కోట్ల నిధులు కూడా విడుదల చేశారు. 26 నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శనకు అవకాశం సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే అవకాశాన్ని సాధారణ ప్రజలకు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చని తెలిపింది. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించిన అనంతరం సాధారణ ప్రజల సందర్శనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాగా, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం 75 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆర్పీ నిలయం ఆవరణలో వివిధ రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో కూడిన ఔషధ ఉద్యానవనం సందర్శకులను ఆకట్టుకుంటుంది. -
బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
-
రాష్ట్రపతి నిలయంలో 'ఎట్ హోం'
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాలుగు రోజులుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా, నగరంలో నాలుగు రోజుల పర్యటన అనంతరం 27వ తేదీ ఆయన ఏపీ రాజధాని అమరావతికి బయల్దేరుతారు. -
24 న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 24 నుంచి 27 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. 24 వ తేదీ రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందులో రామ్‌నాథ్ పాల్గొంటారు. ఆ తర్వాత 26 న రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందు నిర్వహిస్తారు. నగరంలో నాలుగు రోజుల పర్యటన అనంతరం 27వ తేదీ ఆయన అమరావతికి బయల్దేరుతారు. కాగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులు శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సమావేశమవుతారు. -
22న నగరానికి రాష్ట్రపతి కోవింద్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిం ద్ రాష్ట్ర పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం లో ఆయ న బస చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికా రవర్గాలు సూత్రప్రాయంగా ఖరారు చేసిన షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వా నికి అందింది. ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా దేశ ప్రథమ పౌరుడిగా కోవింద్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి బొల్లారం వస్తున్నారు. రాష్ట్రపతి ఈ నెల 26 వరకు ఇక్కడ గడపనున్నారు. -
హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఏకంగా అయిదు కోట్ల విలువైన నిషేధిత మత్తు పదార్థం దొరకటం సంచలనం సృష్టిస్తోంది. బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో తనిఖీలు చేసిన రెవెన్యూ ఇంటెలిజన్స్ అధికారులు... 179 కిలోల ఎఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని లీజుకు తీసుకున్న ఓ వ్యక్తి... డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అతను గతంలో డ్రగ్స్ తయారీ కేసులో పట్టుబడి బెయిల్‌పై బయటకు వచ్చాడని తెలిపారు. ఫ్యాక్టరీలోని ముడిసరుకు, పరికరాలను సీజ్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని తెలిపారు. -
రాష్ట్రపతితో టీపీసీసీ భేటీ
హైదరాబాద్: బొల్లారంలోని రాష్గ్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో టీపీసీసీ బృందం శుక్రవారం సాయంత్రం 6.45 గంటలకు సమావేశం కానుంది. తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ చట్టానికి చేసిన సవరణలపై కాంగ్రెస్ నేతలు ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేయనున్నారు. కొత్తగా ఆమోదం పొందిన బిల్లుతో నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. -
నగదు దోపిడీ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్ట్
సికింద్రాబాద్: బొల్లారం దారిదోపిడీ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లను గురువారం సాయంత్రం అరెస్ట్‌చేశారు. బొల్లారంలో ఇటీవల 19 లక్షల రూపాయలను ఇద్దరు కానిస్టేబుళ్లు సుధాకర్‌రెడ్డి, యాదగిరి దోపిడీ చేసి నగదుతో ఉడాయించారు. కేసునమోదుచేసి దర్యాప్తు చేసిన బొల్లారం పోలీసులు ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి రూ.1.40 లక్షలు కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. -
సికింద్రాబాద్‌లో దారుణం..
హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారి పై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడి అనంతరం హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్ బొల్లారంలోని కళాసిగూడలో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడు అనిల్ అత్యాచారం చేసి హత్య చేశాడు. శనివారం అర్ధరాత్రి చిన్నారిని కిడ్నాప్ చేసిన అనిల్ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చి అక్కడే పడేశాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. అనిల్ గతంలో ఎనిమిది హత్య కేసుల్లో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. మహిళ హత్యకేసులో నిన్ననే జైలు నుంచి విడుదలైన అనిల్ తిరిగి ఈ ఘాతాకానికి ఒడిగట్టాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.