HYD: తోపుడుబండిపైకి దూసుకెళ్లిన కారు.. పరారీలో డాక్టర్‌ | Another Hit And Run Case In Bollaram Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: తోపుడుబండిపైకి దూసుకెళ్లిన కారు.. పరారీలో డాక్టర్‌

Published Thu, Feb 22 2024 4:01 PM | Last Updated on Thu, Feb 22 2024 4:59 PM

Another Hit And Run Case In Bollaram Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని బొల్లారంలో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది. గురువారం తెల్ల‌వారుజామున బొల్లారం ప‌రిధిలో వేగంగా కారు న‌డుపుతూ ఓ వైద్యుడు.. ఫుట్‌పాత్ వెంట ఉన్న తోపుడుబండిపైకి దూసుకెళ్లాడు.

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అక్క‌డే ఉన్న ప‌లువురు వ్య‌క్తులు వెంటాడి కారును అడ్డ‌గించి డాక్ట‌ర్‌ కార్తీక్‌ను ప‌ట్టుకున్నారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన డాక్ట‌ర్.. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఓ ఆస్ప‌త్రిలో న్యూరో స‌ర్జ‌న్‌గా సమాచారం.

ఈ ఘటనలో స‌య్య‌ద్ పాషా అనే వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డగా, తాను ప‌ని చేస్తున్న ఆస్ప‌త్రిలోనే చికిత్స అందిస్తాన‌ని చెప్పిన డాక్టర్‌.. బాధితుడిని త‌న కారులో తీసుకెళ్లాడు. ఈ క్ర‌మంలో అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్ప‌త్రిలో చేర్పించి, ఆ వైద్యుడు పరారయ్యాడు. ప్రస్తుతం బాధితుడి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి: షణ్ముక్ గంజాయి కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement