సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 24 నుంచి 27 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్‌లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. 24 వ తేదీ రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందులో రామ్‌నాథ్ పాల్గొంటారు. ఆ తర్వాత 26 న రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందు నిర్వహిస్తారు. నగరంలో నాలుగు రోజుల పర్యటన అనంతరం 27వ తేదీ ఆయన అమరావతికి బయల్దేరుతారు. కాగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులు శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సమావేశమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment