
కూతుళ్లపై తండ్రుల అత్యాచారం!
హైదరాబాద్: నిర్భయ వంటి కఠినమైన చట్టాలు రూపొందిస్తున్నా మహిళలకు రక్షణ లభించడంలేదు. మహిళలు, ముఖ్యంగా బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో వావివరుసలు లేకుండా కన్న తండ్రులే కూతుళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అటువంటి సంఘటనలు ఈరోజు రాష్ట్రంలో రెండు చోట్ల జరగడం బాధాకరం.
బొల్లారంలో 13 ఏళ్ల కన్నకూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. మరో సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగింది. ఇక్కడ పెంపుడు కూతురుపై తండ్రి అత్యాచారం చేశాడు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, శ్రీకాకుళం పాతపట్నంలో మైనర్ బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.