రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ప్రముఖలకు తేనీటి విందు ఇచ్చారు.
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ప్రముఖలకు తేనీటి విందు ఇచ్చారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ తేనీటి విందుకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ సీఎంలు మహమూద్ ఆలీ, కడియం శ్రీహరి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బస చేస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి గౌరవార్థం నిన్న సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.