హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్‌ కలకలం | 2 arrested for preparing Ephedrine drug, 179 kg of Ephedrine seized | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్‌ కలకలం

Published Thu, Nov 16 2017 11:26 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

2 arrested for preparing Ephedrine drug, 179 kg of Ephedrine seized

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. ఏకంగా అయిదు కోట్ల విలువైన నిషేధిత మత్తు పదార్థం దొరకటం సంచలనం సృష్టిస్తోంది. బొల్లారం ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో తనిఖీలు చేసిన రెవెన్యూ ఇంటెలిజన్స్‌ అధికారులు...  179 కిలోల ఎఫిడ్రిన్‌ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని లీజుకు తీసుకున్న ఓ వ్యక్తి... డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అతను గతంలో డ్రగ్స్‌ తయారీ కేసులో పట్టుబడి బెయిల్‌పై బయటకు వచ్చాడని తెలిపారు. ఫ్యాక్టరీలోని ముడిసరుకు, పరికరాలను సీజ్‌ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement