సాక్షి, సికింద్రాబాద్ : బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు పరస్పరం ఢీకొట్టుకోవడంతో నుజ్జు నుజ్జు అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వైపు వెళుతున్న బ్రిజా కారు శామీర్ పేట్ నుంచి ఎదురు గావస్తున్న బ్రిజా కారును ఢీకొంది. అంతే కాకుండా వెనకాల వస్తున్న యాక్టివా, బీఎండబ్ల్యూ వాహనాలను ఢీకొనడంతో స్కూటీపైన వస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.