
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేసీఆర్‌ను రైతు ఉద్యమకారుడు రాకేష్ టికాయత్ గురువారం కలిశారు. మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. భేటీ అనంతరం రాకేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ, రైతు సమస్యలపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిపారు. జాతీయస్థాయిలో కిసాన్ ఎజెండా రూపొందించాల్సి ఉందని టికాయత్ పేర్కొన్నారు.
చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ, జితేందర్ రెడ్డి రియాక్షన్
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతు బంధు పథకం చాలా బాగుంది. జాతీయ స్థాయిలో ఈ రైతు పథకాలు అమలు చేయాలి. రాజకీయ అంశాలు సమావేశంలో మాట్లాడలేదు. జాతీయ స్థాయిలో రాజకీయ మార్పు ఇప్పుడు ఏమి చెప్పలేనని రాకేష్ టికాయత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment