సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్న కల్పనా సోరెన్‌! | Kalpana Soren Meets Sunita Kejriwal | Sakshi
Sakshi News home page

Delhi: సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్న కల్పనా సోరెన్‌!

Published Sun, Mar 31 2024 12:09 PM | Last Updated on Sun, Mar 31 2024 12:10 PM

Kalpana Soren Meets Sunita Kejriwal - Sakshi

జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్పనా సోరెన్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం జార్ఖండ్‌లో జరిగిన ఘటన మాదిరిగానే ఢిల్లీలో కూడా జరిగిందని అన్నారు. 

తాను సునీతను కలుసుకునేందుకు వచ్చానని,  ఆమె భాధ్యతలను కూడా పంచుకుంటానని అన్నారు.  తాము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతిజ్ఞ చేశామని కల్పనా సోరెన్ చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రం అరవింద్ కేజ్రీవాల్‌ వెంట ఉంటుందని, తాను కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీని కలవబోతున్నానన్నారు. రాంలీలా మైదాన్‌లో జరిగే ఇండియా కూటమి బహిరంగ సభకు హాజరవుతానన్నారు.
 

కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్ ఇద్దరి  పరిస్థితులు ఒకేలాంటివని విశ్లేషకులు అంటారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కల్పనా సోరెన్ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదేవిధంగా, అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసే వరకు సునీతా కేజ్రీవాల్ తన ఇంటికి, కుటుంబానికే పరిమితమయ్యారు. 

హేమంత్ సోరెన్-అరవింద్ కేజ్రీవాల్‌ల అరెస్ట్ తర్వాత కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్‌లు తదుపరి బాధ్యతలను స్వీకరించడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వారిద్దరూ ఈడీ రిమాండ్‌లో ఉన్న తమ భర్తలను కలుసుకుని వారికి ధైర్యాన్ని అందిస్తూనే, మరో వైపు పార్టీని ఐక్యంగా ఉంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement