వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం వైఎస్ జగన్ బృందం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్తో సమావేశమైంది. వైఎస్ జగన్ వెంట పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలను వైఎస్ జగన్ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు.