చిరునవ్వుతో రోగాలను జయించండి
కలెక్టర్ కార్తికేయమిశ్రా
కేన్సర్ రోగులకు పరామర్శ
మాధవపట్నం (సామర్లకోట) : రోగులకు చిరునవ్వే జీవితంలో వెలుగు నింపుతుందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. ప్రపంచ కేన్సర్ సర్వైవర్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలోని సూర్య గ్లోబల్ ఆస్పత్రిలో రోగులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ చేయించుకునే సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. సూర్య గ్లోబుల్ ఆస్పత్రిలో మంచి వైద్యులు ఉన్నారని, రోగులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తనకు సమాచారం ఇచ్చి తగిన సహాయం పొందాలన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని, ఆపరేషన్లు చేయించుకున్న వారిని పరామర్శించి వారి అభిప్రాయాలను సేకరించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో ఆపరేషన్లు చేసిన ఆస్పత్రిగా పేరు పొందింది. దాంతో కలెక్టర్ సూర్య గ్లోబల్ హాస్పటల్‌ను సందర్శించారు. కేన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన పనిలేదని, నేడు అనేక మందులు వచ్చాయని కలెక్టరు సూచించారు. కేన్సర్ వ్యాధి రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హాస్పటల్ చైర్మన్ డాక్టర్ బీహెచ్‌పీఎస్ వీర్రాజు మాట్లాడుతూ గత 14 ఏళ్లలో 10 వేల మందిని కేన్సర్ వ్యాధి నుంచి విముక్తి చేయగా సుఖంగా జీవిస్తున్నారన్నారు.
ఏటా కేన్సర్ సర్వైవర్స్‌డే సందర్భంగా వివిధద మండలాలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు వీర్రాజు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కేన్సర్ చికిత్స, నివారణార్థం ఆధునిక పరికరాలు కలిగి ఉన్నట్టు తెలిపారు. రేడియేషన్‌లో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మొట్టమొదటి ‘ రేపిడ్ ఆర్క్’ అనే ఆధునిక యంత్రం ద్వారా రేడియేషన్ అందిస్తున్న ఏకైక హాస్పటల్‌గా గుర్తింపు పొందడం ఎంతో గర్వంగా ఉందని వీర్రాజు పేర్కొన్నారు. దాదాపు 50 వేల మందికి కేన్సర్‌పై అవగాహన కల్పించామన్నారు. కేన్సర్ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా 85 శాతం రోగులకు చికిత్స అందిస్తున్నామని వివరిం చారు.
కేన్సర్ చికిత్స కొస మెడికల్, సర్జికల్, రేడియేషన్ మూడు విభాగాలు కలిగిన పుల్ టైమ్ కన్సల్టెన్స్ ఉన్న హస్సటల్‌గా ఉభయ గోదావరి జిల్లాలో గుర్తింపు పొందిన్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరు హస్పటల్‌లో సుమారు గంట సమయం వెచ్చించి ప్రతీ రోగిని వివరాలు అడిగి తెలుసుకు న్నందుకు వీర్రాజు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు ఏవీ సురేష్, వై. ప్రశాంత్, నరసింహరెడ్డి, వై. స్వాతి, పీఆర్వో సురేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.