Ilaiyaraaja Meets Rajinikanth At Poes Garden In Chennai - Sakshi
Sakshi News home page

Ilaiyaraaja Meets Rajinikanth: తలైవాతో సంగీత జ్ఞాని భేటీ..

Published Wed, May 25 2022 8:42 AM | Last Updated on Wed, May 25 2022 9:34 AM

Ilaiyaraaja Meets Rajinikanth At Poes Garden In Chennai - Sakshi

చెన్నై సినిమా: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా భేటీ అయ్యారు. మంగళవారం (మే 24) ఉదయం ఇళయరాజా అనూహ్యంగా స్థానిక పోయెస్‌ గార్డెన్‌లోని రజనీకాంత్‌ ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు. ఇద్దరూ చాలా సేపు ము చ్చటించుకున్నారు. అనంతరం ఇళయరాజా తిరిగి బయలుదేరుతుండగా ఏదైనా పనిపై వచ్చారా స్వామి..? అని రజనీకాంత్‌ అడగగా ఏమీ లేదు జూన్‌ 2వ తేదీన కోయంబత్తూరులో సంగీత కచేరీ ఉందని, దీనికి సంబంధించి తన స్టూడియోలో రిహార్సల్స్‌ జరుగుతున్నాయని, ఒక్కడినే వెళుతున్నట్లు చెప్పారు. 

దీంతో రజనీకాంత్‌ తానూ వస్తానంటూ కారులో ఇళయరాజా రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్లారు. అక్కడ కొంచెం సేపు రిహార్సల్స్‌ను ఎంజాయ్‌ చేశారు. ఇంతకీ ఇళయరాజా సడన్‌గా రజనీకాంత్‌ ఇంటికి ఎందుకు వెళ్లారు? వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కాగా రజనీ కాంత్‌, ఇళయరాజా కాంబినేషన్‌లో వచ్చిన ఎన్నో పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. 

చదవండి: 👇
పగిలిన గాజు ముక్కలతో డ్రెస్‌.. 20 కేజీల బరువు..
11 నెలలుగా నా ఇంట్లో నా భార్యతో ఉంటున్నాడు: నటుడు


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement