ముంబై: జనతాదళ్(యు) ఉపాధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. సేన– బీజేపీ సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ఈ ఎన్‌డీఏ కూటమి పార్టీల నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో చర్చించిన వివరాలను వెల్లడించేందుకు శివసేన నిరాకరించింది. ‘ఎన్‌డీఏలో భాగంగానే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మహారాష్ట్రలో మీతో కలిసి పనిచేయాలని ఉంది’ అంటూ ప్రశాంత్ కిశోర్ అంతకుముందు ట్విట్టర్‌లో పేర్కొనగా ఆయన్ను ముంబైలోని శివసేన కార్యాలయం ‘మాతోశ్రీ’కి ఆహ్వానిస్తూ శివసేన యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య థాకరే బదులిచ్చారు. ఉద్ధవ్, ప్రశాంత్ కిశోర్‌ల భేటీ ఫొటోలను ఆదిత్య థాకరే ట్విట్టర్‌లో ఉంచారు. శివసేన మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు కేంద్రంలోనూ భాగస్వామిగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment