
సాక్షి, ఢిల్లీ: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రియాంక గాంధీతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితులపై చర్చించామని వివరించారు. ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి తనను కలవమన్నారన్నారు. తెలంగాణలో పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశంపై చర్చించామన్నారు. ఫంక్షన్ కారణంగా మొన్న సమావేశానికి రాలేకపోయానని చెప్పానని తెలిపారు. కలిసికట్టుగా పనిచేయాలని ప్రియాంక అన్నారని పేర్కొన్నారు. అన్ని విషయాలు మాట్లాడుకున్నామని, తాను కొన్ని సలహాలు ఇచ్చానని ఆయన తెలిపారు.
చదవండి: బండి సంజయ్ పాదయాత్రపై సస్పెన్స్.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ..
Comments
Please login to add a commentAdd a comment