వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు శుక్రవారం కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించారు.
కాకినాడ: వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు శుక్రవారం కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించారు. మద్రగడ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆయన అన్నారు.
చంద్రబాబుకు తల పొగరెక్కి, ఎవరినైనా అణచివేయాలని చూస్తున్నారని అంబటి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదని తెలిపారు. ముద్రగడ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ముద్రగడ ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.