
ఆస్ట్రేలియా ఎంపీ జూలీ ఇసాబెల్ బిషప్‌తో ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ దేశానికి చెందిన ఎంపీ జూలీ ఇసాబెల్ బిషప్‌తో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా, భారత రాజకీయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాలు, స్వరాష్ట్ర సాధనలో రాష్ట్ర ప్రజలు చూపిన తెగువ, రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తీరును కోమటిరెడ్డి ఆస్ట్రేలియా ఎంపీకి వివరించారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియాలో ప్రభుత్వ శాఖల పనితీరు, ఆ దేశంలో జరుగుతున్న సంస్కరణల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment