‘జీహెచ్‌ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన | Minister Komatireddy Venkatreddy Sesnsational Announcement On Ghmc | Sakshi
Sakshi News home page

‘జీహెచ్‌ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన

Published Sat, Oct 5 2024 12:24 PM | Last Updated on Sat, Oct 5 2024 4:24 PM

Minister Komatireddy Venkatreddy Sesnsational Announcement On Ghmc

సాక్షి,హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌​ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ)ని నాలుగు కార్పొరేషన్లుగా విభజించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. ఈ విషయమై శనివారం(అక్టోబర్‌ 5) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘హైదరాబాద్ మహా నగరంలో జనాభా కోటిన్నరకు చేరింది.జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా చేసిన తర్వాత నలుగురు మేయర్లు ఉంటారు.రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నలుగురు మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

ఈ నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచేందుకు రూ.30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)ను నిర్మిస్తాం.అమెరికా తర్వాత అత్యధికంగా ఎంఎన్‌సీ కంపెనీల హెడ్‌క్వార్టర్స్‌ హైదరాబాద్‌లోనే ఉండనున్నాయి’అని కోమటిరెడ్డి తెలిపారు. 

ఇదీ చదవండి: హోం మంత్రి పదవి ఇవ్వాలని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement