హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మిశ్రాను కలిసిన సీఎం జగన్‌ | CM YS Jagan Meets AP High Court Chief Justice Prashant Kumar Mishra | Sakshi
Sakshi News home page

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మిశ్రాను కలిసిన సీఎం జగన్‌

Published Mon, Apr 25 2022 7:12 PM | Last Updated on Mon, Apr 25 2022 9:30 PM

CM YS Jagan Meets AP High Court Chief Justice Prashant Kumar Mishra - Sakshi

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 30న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరగనున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల భేటీ దృష్ట్యా సమావేశం అజెండాపై ఇరువురు చర్చించారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన నాల్కో, మిథానీ సీఎండీలు

ఏప్రిల్‌ 4, 2016 నాటి ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతితో పాటు, పేరుకుపోయిన కేసుల పరిష్కారం, న్యాయ సహాయంపై మార్గదర్శక ప్రణాళిక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ, ఈ-కోర్టులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటికి సంబంధించి రాష్ట్ర నుంచి నివేదించనున్న అంశాలపై ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చర్చించారు. హైకోర్టు ఉన్నత పరిపాలనా అధికారులు, రాష్ట ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement