బీసీసీఐ ప్రెసిడెంట్‌ను కలిసిన టీసీఏ ప్రతినిధులు
Published Thu, Aug 4 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు గుర్తింపు ఇవ్వాలని కో రుతూ రాష్ట్ర ప్రతినిధి బృందం సభ్యులు బుధవారం ఢిల్లీలో బీసీసీఐ (బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్రెసిడెంట్ అనురాగ్ సింగ్‌ఠాకూర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గత 65 ఏళ్లుగా తెలంగాణ క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్‌కు వివరించినట్లు టీసీఏ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి తెలిపారు. ఈ మేరకు అనురాగ్‌సింగ్ సానుకూలంగా స్పందించి తెలంగాణ క్రికెటర్లను రంజిస్థాయి వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బీసీసీఐ ప్రెసిడెంట్‌ను కలిసిన వారిలో టీసీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లపెల్లి జయపాల్, సభ్యులు వీరేష్, నరోత్తమరెడ్డి, చంద్రసేన్‌రెడ్డి, నయీం, శ్రావన్, మహేష్‌లు ఉన్నారు.
Advertisement