అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఫిబ్రవరిలోనే జరగనుందా? ఈ దిశగా ఇరు దేశాల దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? అవుననే అంటోంది రాయిటర్స్ వార్తా సంస్థ. వారు వాషింగ్టన్‌లో భేటీ కానున్నారని భారత దౌత్యవర్గాలను ఉటంకిస్తూ కథనం వెలువరించింది. ‘‘ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోషించనుంది.
చైనా దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. హెచ్–1బీ వీసాల్లో సింహభాగం భారతీయులే దక్కించుకుంటారన్నది తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోదీతో లేవనెత్తవచ్చు. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారు’’ అని రాయిటర్స్ పేర్కొంది. భారత్‌కు అతి పెద్ద వర్తక భాగస్వామిగా అమెరికా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023–24లో 118 బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వర్తకం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment