ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు అబ్‌రామ్ కోరిక నెరవేరింది. అబ్ రామ్కి ఎంతగానో ఇష్టమైన 'ఛోటాభీమ్' క్యారెక్టర్ సృష్టికర్త గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఈఓ రాజీవ్ చిలకను తన నివాసంలో కలుసుకున్నాడు. రాజీవ్, షారుక్ కుమారుడి కోసం ఒక బొమ్మను గిఫ్ట్ గా తీసుకువచ్చాడు. పిల్లలు ఛోటా భీమ్ కార్యక్రమాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారని షారుక్ తెలిపారు. మరోవైపు ఛోటా భీమ్ కార్యక్రమం పిల్లలు చూడవలసిన ఒక మంచి కార్యక్రమమని నటి కాజల్ కూడా ప్రశంసించారు.
రాజీవ్ తదుపరి కార్టూన్ ప్రోగ్రామ్ 'చోటాభీమ్-హిమాలయన్ ఆడ్వెంచర్' జనవరి 8న విడుదల కానుంది. సరోగసి ద్వారా షారుఖ్ అబ్రామ్కు తండ్రి అయిన విషయం తెలిసిందే. చోటాభీమ్, మోగ్లీ కార్యక్రమాలంటే అబ్రామ్ కు ఎంతో ఇష్టమని ఇది వరకే షారుఖ్ తెలిపిన విషయం విధితమే.
షారుక్ కుమారున్ని కలిసిన 'ఛోటా భీమ్'
Published Sat, Jan 2 2016 4:41 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM
Advertisement
Advertisement