విమానంలో పిల్లోడి పుట్టిన రోజు | shah rukh khan celebrates son birthday in plane | Sakshi
Sakshi News home page

విమానంలో పిల్లోడి పుట్టిన రోజు

Published Sat, May 28 2016 8:05 AM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

విమానంలో పిల్లోడి పుట్టిన రోజు

విమానంలో పిల్లోడి పుట్టిన రోజు

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన చిన్న కొడుకు అబ్రామ్ మూడో పుట్టినరోజు వేడుకలను విమానంలో చేశాడు. తన పిల్లలు సుహానా, అబ్రాంలతో కలిసి విదేశాలకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు వాళ్లిద్దరి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పిల్లలను 'మినియన్స్' అని సరదాగా పిలుచుకుంటాడు కింగ్ ఖాన్.

''నా ఇద్దరు మినియన్లతో కలిసి ఇండియాకు తిరిగొస్తూ విమానంలోనే బర్త్‌డే వేడుకలు చేసుకుంటున్నాం. మాకు ఎవరైనా కేక్ తెచ్చిస్తే బాగుండు.. లేకపోతే కిండర్ ఎగ్స్ చేయాల్సి ఉంటుంది'' అని ట్వీట్ చేశాడు. సరొగసీ పద్ధతి ద్వారా 2013 మే 27న అబ్రామ్ పుట్టిన సంగతి తెలిసిందే. షారుక్‌కు అంతకుముందే ఆర్యన్, సుహానా అనే ఇద్దరు పిల్లలున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement