![Shashi Tharoor Calling For CWC Elections Revive Parliamentary Board - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/13/Shashi-Tharoor.jpg.webp?itok=hs_nqzlt)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైతే పార్టీని సంస్కరణల బాట పట్టిస్తానని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ప్రకటించారు. ‘పార్టీ నియమావళిలోని ప్రతి నిబంధననూ అమలుచేస్తా. కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహిస్తా. పాతికేళ్లకుపైగా చేష్టలుడిగిన పార్లమెంటరీ బోర్డ్‌కు పునర్‌వైభవాన్ని తీసుకొస్తా. నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరిస్తా. పార్టీకి క్షేత్రస్థాయిలో మూలస్తంభాలైన పధాధికారులకు మరిన్ని అధికారాలు కట్టబెడతా. ఉదయ్‌పూర్ తీర్మానాలను అమల్లోకి తెస్తా’ అని బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను సంస్కరణవాదిని. పార్టీని నడిపే విధానంలో వైవిధ్యం చూపిస్తా. 2024లో బీజేపీని ఢీకొట్టి ఓడించేలా కాంగ్రెస్‌ను పటిష్టపరుస్తా’ అన్నారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ అన్నాచెల్లెళ్ల పార్టీ
Comments
Please login to add a commentAdd a comment