సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌గాంధీ చేపట్టాలని టీపీసీసీ కోరింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ నూతన ప్రతినిధుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మా నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ముఖ్యనేతలు వి.హనుమంత రావు, షబ్బీర్‌అలీ, గీతారెడ్డి, మధు యాష్కీ, దామోదర రాజనర్సింహ, అంజన్‌కుమార్, మహేశ్‌కుమార్‌గౌడ్ బలపరిచారు.
దీంతో పాటు పీసీసీ నూతన కార్యవర్గం, ఏఐసీసీ సభ్యులు, ఏఐసీసీ కార్యవర్గ నియామక బాధ్యతలను సోని యాకు అప్పగిస్తూ మరో తీర్మానం చేశా రు. ఈ తీర్మానాన్ని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, వి.హనుమం తరావు బలపరిచారు. ఏఐసీసీ తరఫు రిటర్నింగ్ అధికారిగా కేరళకు చెందిన ఎంపీ రాజమోహన్ ఉన్నతన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఛత్తీస్‌గఢ్ నేత రాజ్‌భగేల్‌లు హాజరయ్యారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయింది: ఉన్నతన్
ప్రతినిధుల సమావేశం తర్వాత గాంధీభవన్‌లో రాజ్ భగేల్, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, హర్కర వేణుగోపాల్‌లతో కలిసి ఉన్నతన్ మీడి యాతో మాట్లాడారు. పీసీసీ నూతన కార్యవర్గం, ఇతర నియామకాల బాధ్య తను సోనియాకు అప్పగించడంతో పీసీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. తీర్మానాలను జాతీయ ఎన్నికల కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి అందజేస్తామని తెలిపారు.
కాగా, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను సోనియా లేదా రాహుల్ తీసుకోకుంటే ఇతర నేతలు పోటీకి వస్తే తాము కూడా నామినేషన్లు వేయాలనే చర్చ సీనియర్ నేతల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment