
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ ఫోటోలను మార్ఫింగ్ చేసి రావణుడిగా చిత్రీకరించి.. బీజేపీ నేతలు సోషలో మీడియాలో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ, మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రావణుడి అవతారంలో రాహుల్ గాంధీ ఫొటోను బీజేపీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇక, రాహుల్ ఫొటోకు మరింత వివాదాస్పదంగా టైటిల్‌ను పెట్టింది.
దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేసింది. ఈ వివాదాస్పద ఫొటోపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
చదవండి: 15 నుంచి కాంగ్రెస్ బస్సుయాత్ర!
Comments
Please login to add a commentAdd a comment